News January 27, 2025

అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

image

TG: అర్ధరాత్రి నుంచి ‘రైతు భరోసా’, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని సీఎం రేవంత్ నిన్న ప్రకటించారు. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పడతాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అందే సూచనలు ఉన్నట్లు సమాచారం. మరి మీకు డబ్బులు పడ్డాయా?

Similar News

News October 20, 2025

దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

image

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.

News October 20, 2025

దీపావళి: ఇవాళ ఏం చేయాలి?

image

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉంటే రాత్రి వేళలో <<18052455>>జాగ్రత్తలు<<>> పాటిస్తూ టపాసులు కాల్చాలి.

News October 20, 2025

దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

image

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్‌లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.