News September 24, 2025

CJI పర్యవేక్షణలో ఓటుకు నోటు కేసును విచారించాలి: మత్తయ్య 1/2

image

తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఓటుకునోటు కేసులో జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పలు అంశాలు పేర్కొన్నారు. CJI లేదా తెలంగాణేతర రాష్ట్ర HCతో కేసు పునర్విచారణ చేయాలన్నారు. నాడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి TDP మహానాడుకు పిలిపించి స్టీవెన్సన్‌ను ఒప్పించేలా తనతో నేరం చేయించారని ఆరోపించారు. లోకేశ్‌తో పాటు నాటి ఇంటెలిజెన్స్, ACB అధికారులు, లాయర్లు సహా అందరినీ నిందితులుగా చేర్చాలన్నారు.

Similar News

News September 24, 2025

మెడికల్ సీట్ల పెంపునకు కేంద్రం ఆమోదం

image

దేశంలో వైద్య విద్య విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. UG, PG మెడికల్ సీట్ల పెంపునకు అంగీకరించింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్-3 కింద 5వేల కొత్త PG, 5,023 MBBS సీట్లకు ఆమోదం తెలిపింది. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్ల వరకు నిధులు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా Govt వైద్య కళాశాలలు, ఆస్పత్రుల రెనోవేషన్‌కు సాయం, స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమంకానుంది.

News September 24, 2025

ఆఫర్‌లోనూ ధరలు తగ్గలేదని చర్చ!

image

ఈ కామర్స్ సైట్లు దసరా సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించగా, తొలిరోజు ఉన్న ధరలు ఇప్పుడు లేకపోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ యూజర్ iphone 15plus ఫోన్‌ను బుక్ చేసేందుకు ట్రై చేయగా 23% ఆఫ్‌తో రూ.68,999గా చూపించిందని పేర్కొన్నారు. గతనెలలో ఇదే ఫోన్ రూ.69,499 ఉందని, ఆఫర్ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మీకూ ఇలా జరిగిందా?

News September 24, 2025

అనార్కలీకి ఈ ఫుట్‌వేర్ బెస్ట్

image

ఎత్నిక్ వేర్‌లో అనార్కలీకి ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆఫీస్ వర్క్‌వేర్‌గా, ఫంక్షనల్ వేర్‌గా ఎలా ధరించినా ఎంతో అందంగా ఉంటారు అమ్మాయిలు. అయితే ఏ సందర్భానికైనా అనార్కలీని సరిగ్గా స్టైల్ చేయడానికి కొన్ని ఫుట్‌వేర్‌లు బెస్ట్ అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. ముఖ్యంగా జుట్టీస్, కొల్హాపురి, ఎంబ్రాయిడరీ ఫ్లాట్స్, బ్లాక్ హీల్స్ వంటివి అనార్కలీ స్టైలింగ్‌లో వాడితే ఎంతో ఎలిగెంట్‌గా ఉంటాయంటున్నారు.