News August 24, 2024

విద్యావంతుల్లో కులపిచ్చి దారుణం: సిద్దరామయ్య

image

కులాలు, మతాలుగా సమాజం విడిపోతే వైషమ్యాలు పెరుగుతాయని కర్ణాటక సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. విద్యావంతుల్లోనూ కులపిచ్చి ఉండటం దారుణమన్నారు. ‘కుల వైషమ్యాలను పెంచేవాళ్లే గాంధీని చంపేశారు. ఆయన సిద్ధాంతాలు ఈనాటికీ పనిచేస్తాయి. శాంతి, సత్యం, న్యాయం, సోదరభావాన్ని ఆయన చాటారు. ప్రకృతి మన అవసరాలని తీరుస్తుందే తప్ప అత్యాశను కాదని చెప్పేవారు. నిజానికి వయనాడ్ విపత్తుకు అత్యాశే కారణం’ అని సిద్దూ పేర్కొన్నారు.

Similar News

News April 11, 2026

తిరుమల క్షేత్రపాలకుడు ఎవరో కాదు…!

image

7 కొండలపై కోట్లాది భక్తులకు అభయమిస్తున్న శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి మరో రూపమైన రుద్రుడు. ఈ క్షేత్రపాలక శిల తిరుమల గోగర్భం వద్ద, పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉంది. శివకేశవులకు భేదం లేదని ఇది నిరూపిస్తోంది. ప్రతి మహా శివరాత్రి రోజున TTD వారు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తిరుమలలో విష్ణువుతో పాటు రుద్రుడికి కూడా ప్రాధాన్యత ఉందనడానికి ఇదే నిదర్శనం

News April 11, 2026

పెళ్లి చూపుల్లో కొత్త ట్రెండ్.. వేదిక, పద్ధతి మారుతోంది!

image

నేటి కాలంలో పెళ్లి సంబంధాల వేట మారుతోంది. ముఖ్యంగా నగరాల్లోని యువత పాత పద్ధతులకు స్వస్తి పలికి.. కొత్త తరం మ్యాచ్ మేకింగ్ పద్ధతులను ఎంచుకుంటున్నారు. వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ చూసుకొని వారిని స్వయంగా కలిసి మాట్లాడేందుకు ప్రత్యేక ఈవెంట్స్, మీటప్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. నమ్మకం, గోప్యతతో పాటు వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ వేదికలు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.

News April 11, 2026

ఈనెల 16న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ స్ట్రీమింగ్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా OTT విడుదల ఖరారైంది. ఈనెల 16న ఈ మూవీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పవన్ స్టైల్, ఆటిట్యూడ్ అభిమానులను ఆకట్టుకున్నాయి.