News February 4, 2025

కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Similar News

News October 25, 2025

అంతర పంటలతో వ్యవసాయంలో అధిక లాభం

image

ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటను అంతర పంట అంటారు. ఈ విధానంలో ఒక పంట దెబ్బతిన్నా.. మరొకటి చేతికొస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 2 పంటల నుంచి రైతు మంచి ఆదాయం పొందవచ్చు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద, నేలకోత తగ్గి.. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటల సాగు వల్ల వచ్చిన ఆదాయం ప్రధాన పంట పెట్టుబడికి సహాయపడుతుంది.

News October 25, 2025

ఆస్ట్రేలియా బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్, అర్షదీప్ స్థానంలో కుల్దీప్, ప్రసిద్ధ్ జట్టులోకి వచ్చారు.
భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, సుందర్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్(C), షార్ట్, రెన్‌షా, కారే, కొన్నోలీ, ఓవెన్, నాథన్ ఎల్లిస్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.

News October 25, 2025

ముగిసిన చంద్రబాబు దుబాయ్ పర్యటన

image

AP: మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII ఇన్వెస్టర్స్‌ మీట్‌కు వారిని ఆహ్వానించింది. నిన్న గల్ఫ్‌ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.