News November 15, 2024

కులగణన సర్వే 30% పూర్తి: మంత్రి పొన్నం

image

TG: కులగణన సర్వే 30% పూర్తయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని, సర్వేలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగట్లేదని చెప్పారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News February 7, 2026

ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

image

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.

News February 7, 2026

ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

image

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?

News February 7, 2026

చక్కటి నిద్ర కోసం సింపుల్ టిప్స్

image

*ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
*గదిలో చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. ఐ మాస్క్ ధరించాలి.
*రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు.
*పడుకోవడానికి 3-4 గంటల ముందు మద్యం సేవించవద్దు.
*రోజూ ఉదయం వ్యాయామం చేయడంతో పాటు ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.