News November 7, 2024
కులగణన సర్వే.. ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?
TG: పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి డోర్ నంబర్, యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభంకానుంది. ఈలోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆధార్‌లో అడ్రస్ ఉన్నచోటే వివరాలు నమోదు చేయించుకోవాలని సమాచారం.
Similar News
News November 7, 2024
20 పరుగుల తేడాతో 10 వికెట్లు
రంజీ ట్రోఫీలో భాగంగా J&Kతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ కుప్పకూలింది. 53/0 స్థితి నుంచి 73 పరుగులకే ఆలౌటైంది. 20 పరుగుల తేడాతో 10 మంది బ్యాటర్లు ఔటయ్యారు. నలుగురు డకౌట్ కాగా, మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్లు బమంబా 21, అర్పిత్ 24 రన్స్ చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి.
News November 7, 2024
మహిళలకు ప్రతినెలా రూ.3వేలు: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.
News November 7, 2024
చాహల్‌పై చిన్న చూపెందుకు?
టీమ్ఇండియా బౌలర్ చాహల్‌కు గడ్డుకాలం నడుస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి అదరగొట్టే చాహల్‌కు ప్రస్తుతం ఛాన్సులే రావట్లేదు. దీంతో IPLలో, Tటీ20ల్లో చాహల్ ప్రతిభను గుర్తించట్లేదని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. RCB,RR తరఫున చాహల్ (139, 66) అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టు నుంచి రిలీజ్ చేశారని మండిపడుతున్నారు. T20 క్రికెట్లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టులో చోటు ఇవ్వట్లేదంటున్నారు. మీ కామెంట్?