News November 18, 2024
దూరదృష్టితో కులగణన చేపట్టాం: పొంగులేటి
TG: గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. KCR ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. దూరదృష్టితో తమ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని తెలిపారు. తాము ఏ పనినీ కక్షపూరితంగా చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయని వెల్లడించారు.
Similar News
News November 18, 2024
దారుణం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, బాలిక హత్య!
HYDలోని మియాపూర్ అంజయ్య నగర్‌కు చెందిన బాలిక (17) ఈ నెల 8న అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు బాలిక డెడ్‌బాడీని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో గుర్తించారు. బాలికకు ఇన్‌స్టాలో పరిచయమైన ఉప్పుగూడ యువకుడే హత్యకు కారణమై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 18, 2024
గ్రూప్-3: సగం మంది పరీక్షలు రాయలేదు!
TG: గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి 50% మందే హాజరయ్యారు. నిన్న నిర్వహించిన పేపర్-1కు 51.1%, పేపర్-2కు 50.7%, నేడు నిర్వహించిన పేపర్-3కి 50.24% హాజరైనట్లు TGPSC తెలిపింది. ఈ గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 1363 పోస్టులను భర్తీ చేయనున్నారు.
News November 18, 2024
RCBకి కొత్త బౌలింగ్ కోచ్.. స్పెషాలిటీ ఇదే!
IPL2025 కోసం ఓంకార్ సాల్వీని RCB కొత్త బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ముంబై రంజీ టీమ్ హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నారు. గతంలో KKR సపోర్ట్ స్టాఫ్‌లోనూ పనిచేశారు. ఆయన కోచింగ్‌లోనే ముంబై గత ఏడాది రంజీ, ఇరానీ ట్రోఫీలను గెలిచింది. వచ్చే ఏడాది దేశవాళీ సీజన్ ముగియగానే ఆయన RCBతో కలుస్తారు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని వెలికితీస్తుండటంతో రెండేళ్లుగా డొమెస్టిక్ సర్క్యూట్లో ఆయన పేరు మార్మోగుతోంది.