News October 9, 2025
ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష!

కులవివక్ష రాజకీయాల్లోనే కాదు అధికారులనూ పట్టిపీడిస్తోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సీనియర్ అధికారులు వేధిస్తున్నారని తెలుగువాడైన హరియాణా ADGP పూరన్ కుమార్ 8 పేజీల లేఖ రాసి ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు శాఖలో కులవివక్షతో పాటు అక్రమాలపై గళమెత్తడంతో ఉన్నతాధికారులు తనను నాశనం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. లంచం కేసులోనూ ఇరికించారని తుపాకీతో కాల్చుకున్నారు. ఆయన భార్య అమనీత్ IAS.
Similar News
News October 9, 2025
SBIలో మేనేజర్ ఉద్యోగాలు

SBI 7 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/FRM/CA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లుకాగా, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News October 9, 2025
నిరుద్యోగులకు శుభవార్త.. గరిష్ఠ వయోపరిమితి పెంపు

AP: నాన్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 34 నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫామ్ పోస్టులకు మాత్రం రెండేళ్లు పొడిగించింది. 2026, సెప్టెంబర్ 30 వరకు ఈ వయో సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి APPSC, ఇతర రిక్రూట్‌మెంట్ సంస్థల ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ వయోపరిమితి అమలవుతుందని తెలిపింది.
News October 9, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వేంకటాద్రి

సాధన చేసే వ్యక్తి ఇక్కడ ధ్యానం చేస్తే.. అతని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరుతుంది. అప్పుడు, అంతకుముందు 6 కొండలపై జరిపిన సాధన 6 చెడు గుణాలను (కామ, కోపం, దురాశ, పక్షపాతం, గర్వం, అసూయ) తొలగిస్తుంది. శ్రీకృష్ణుడు కాళీయ సర్పం తలపై నృత్యం చేసినట్లుగా.. ఈ చెడు గుణాలు తొలగిపోతాయి. ఈ దశలో సాధకుడికి, దేవుడికి మధ్య ఎలాంటి అడ్డు ఉండదు. ఈ అత్యున్నత స్థితిని చేరుకునే కొండనే వేంకటాద్రి అంటారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>