News May 26, 2024

నా ప్రేమకు కులం అడ్డొచ్చింది: సిద్ధ రామయ్య

image

తాను చదువుకునే రోజుల్లో లవ్‌లో పడ్డానని, కులం వేరు కావడంతో ప్రేమను వదులుకున్నానని కర్ణాటక CM సిద్ధ రామయ్య చెప్పారు. మైసూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను వివాహం చేసుకుంటానని అడిగితే అమ్మాయితో పాటు ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదన్నారు. దీంతో వేరే ఆలోచన లేకుండా తమ వర్గానికి చెందిన అమ్మాయిని చేసుకున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం కులాంతర వివాహాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

కేరళలో PAM కలకలం.. 19 మంది మృతి

image

కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM) అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 61 కేసులు, 19 మరణాలు సంభవించాయి. క్లోరినేషన్ సరిగా లేని నీటిలో ఉండే నేగ్లేరియా ఫౌలెరీ(మెదడును తినే) అమీబా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈత/స్నానం సమయంలో నీటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

News September 17, 2025

ASIA CUP: పాక్-UAE మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

image

తమ మ్యాచ్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలన్న పాక్‌కు ICC షాక్ ఇచ్చింది. పాక్-UAE మ్యాచ్‌కు అతడినే రిఫరీగా కొనసాగిస్తోంది. మరోవైపు హ్యాండ్ షేక్ వివాదంపై పైక్రాఫ్ట్ తాజాగా తమకు క్షమాపణ చెప్పాడని పీసీబీ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం. అటు మ్యాచులో పాక్‌కు UAE షాక్ ఇస్తోంది. తొలి ఓవర్‌లో ఓపెనర్ అయూబ్‌ను డకౌట్‌గా వెనక్కి పంపింది. పాక్ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.

News September 17, 2025

హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్

image

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.