News November 17, 2024
కులగణన.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
TG: సమగ్ర కులగణనలో సేకరించిన వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ సర్వేలో సేకరించిన డేటాను ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
Similar News
News November 17, 2024
‘మట్కా’ సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. రూ.42కోట్లతో ఈ మూవీని రూపొందించగా, నెట్ఫ్లిక్స్ రూ.15కోట్లు చెల్లించినట్లు సమాచారం. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. ఈనెల 14 రిలీజైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News November 17, 2024
నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబు దాడి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి కలకలం రేపింది. రెండు బాంబులు ఆయన ఇంటి గార్డెన్లో పడ్డట్లు రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వెల్లడించారు. దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ అటాక్ పని ఇరాన్దేనని భావిస్తున్నారు.
News November 17, 2024
డిసెంబర్లో హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధం కీర్తికి నచ్చిందని, దీంతో డిసెంబర్లోనే వీరిద్దరికీ వివాహం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని పింక్విల్లా తెలిపింది. కాగా, పెళ్లి కొడుకు బంధువేనని, గోవాలో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో మ్యారేజ్ జరుగుతుందని వెల్లడించింది. దీనిపై కీర్తి టీమ్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.