News October 30, 2024
టీచర్లతో కులగణన: భట్టి

TG: వచ్చే నెల 6 నుంచి మొదలయ్యే కులగణనకు టీచర్లను వినియోగించుకోవాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. స్కూల్ ముగిసిన తర్వాత ఒక్కో ఉపాధ్యాయుడు రోజూ 5-7 ఇళ్లలో వివరాలు సేకరించాలన్నారు. ఇందులో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మంచి వేతనం ఇస్తామని చెప్పారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News January 16, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పోస్టులు

బరక్పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 16, 2026
కనుమ రోజు మాంసాహారం తీసుకోకూడదా?

ఆధ్యాత్మికపరంగా కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పశువులను దైవంగా భావించి పూజిస్తారు కాబట్టి మాంసాహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘మొదటి మూడు రోజులు శాకాహారంతో దైవచింతనలో గడపడం శ్రేయస్కరం. మాంసాహార ప్రియులు నాలుగవ రోజైన ‘ముక్కనుమ’ నాడు తమకు ఇష్టమైన వంటకాలను వండుకుని తింటారు. కనుమ రోజున పశువుల పట్ల కృతజ్ఞత చూపిస్తూ, శాకాహార నియమాన్ని పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.
News January 16, 2026
SSC కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్

సాయుధ బలగాల్లోని 8 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి SSC నిర్వహించిన కానిస్టేబుల్ జీడీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 53,690 పోస్టుల ఎంపికకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. గతేడాది ఫిబ్రవరిలో CBT నిర్వహించగా 24లక్షల మంది పాల్గొన్నారు. జూన్లో PET, PST, ఆగస్టు నుంచి SEP వరకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించారు. అఫీషియల్ <


