News March 11, 2025
అభిషేక్ మహంతికి క్యాట్ షాక్!

తనను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఐపీఎస్ అభిషేక్ మహంతి చేసిన విజ్ఞప్తిని క్యాట్ తిరస్కరించింది. డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కరీంనగర్ సీపీగా పనిచేసిన అభిషేక్‌ను ఏపీలో రిపోర్టు చేయాలని ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 20, 2025
SM డిటాక్స్.. మెంటల్ హెల్త్‌కు బూస్ట్

ఒక వారం SMకు దూరంగా ఉంటే మెంటల్ హెల్త్ మెరుగవుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీలో తేలింది. యాంగ్జైటీ 16.1%, డిప్రెషన్ 24.8%, ఇన్సోమ్నియా లక్షణాలు 14.5% తగ్గినట్టు గుర్తించింది. యువకులు రోజుకు 2గంటలు SM వాడుతున్నట్టు ఫోన్ డేటాతో తెలుసుకుంది. ‘డిటాక్స్ టైమ్‌లో SM వాడకం వారానికి 1.9hr నుంచి 30 నిమిషాలకు తగ్గింది. మిగిలిన టైమ్‌లో పలువురు బయటకు వెళ్లగా, కొందరు వర్కౌట్స్ చేశారు’ అని తెలిపింది.
News December 20, 2025
ALERT: ఈ వేరుశనగలు తింటే లివర్ క్యాన్సర్!

బూజు పట్టిన వేరుశనగలు తినడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిలో ఉండే అఫ్లాటాక్సిన్ B1 అనే విషపూరిత రసాయనం కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయడమే కాకుండా, DNAను మార్పు చేసి భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఆహార నిల్వ విషయంలో అప్రమత్తంగా ఉంటూ రంగు మారిన, బూజు పట్టిన గింజలను పారేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT
News December 20, 2025
అలాంటి చోట వాస్తు ప్రభావం ఉండదా ?

వేయి గడపలున్న చోట వాస్తు ప్రభావం ఉండదనుకోవడం భ్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ సాంకేతిక, భౌగోళిక అంశాలు. వాటి వల్ల జరిగే నష్టాలను వాస్తుతో ముడిపెట్టకూడదు. చుట్టూ ఎన్ని ఇళ్లు ఉన్నా మన ఇంటి వాస్తు మనకు ముఖ్యం. వాస్తు అనుసరిస్తూనే, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ఇంటి నిర్మాణం ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


