India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.కళ్యాణిని దావోస్‌లోమంత్రి నారా లోకేశ్ కలిశారు. రక్షణ తయారీ ప్రాజెక్టు గురించి చర్చించారు. మడకశిర నియోజకవర్గం ముర్దనహళ్లిలో 1000 ఎకరాల్లో ₹2400 కోట్లతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కళ్యాణి తెలిపారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి లోకేశ్ ఆయనను కోరారు.
అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హల్‌లో మంగళవారం డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా పలు పంటలకు మంజూరు చేసే రుణ పరిమితిని ఖరీఫ్-2025, రబీ 2025-26 సంవత్సరాలకు నిర్ణయించామన్నారు. ఈ పరిమితిని రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం కోసం పంపినట్లు వివరించారు.
కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పల గ్రామం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 2010లో డీఎస్పీగా విధుల్లో చేరారు. నాగర్ కర్నూల్, చింతలపల్లె, కడపలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2018లో ఏఎస్పీగా ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమోషన్‌పై ఇటీవల ఎస్పీగా పదోన్నతి రావడంతో మొదటి పోస్టింగ్ కడపకు ఇచ్చారు.
అనంతపురం జిల్లాకు చెందిన వినయ్ కుమార్ ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. అనంతపురం మండలం కురుగుంటకు చెందిన వినయ్ కుమార్.. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు ట్రోఫీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రంజీ జట్టుకు వినయ్ కుమార్ ఎంపిక కావడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండల టీడీపల్లికి చెందిన చంద్రప్ప తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేద కుటుంబం కావడంతో ఆదుకోవాలంటూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా మంత్రి నారా లోకేశ్‌ను కోరారు. స్పందించిన మంత్రి చంద్రప్పకు అవసరమైన సహాయాన్ని తన టీమ్ వెంటనే అందజేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చికిత్స కోసం రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.
పుట్టపర్తిలో నేడు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా రవాణా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రశాంతి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందులో రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు వివిధ కారణాలతో గైర్హాజరైన వారికి మంగళవారం అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లాలో గత నెల 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రోజుల్లో గైర్హాజరు అయిన వారు రేపు పరీక్షల్లో పాల్గొనాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా భార్య తబుసం, ప్రియుడు నదీముల్లాను అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. ఈ నెల 18న అల్లా బకాశ్ ఇంట్లో నిద్రిస్తుండగా భార్య తబుసం, ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపారని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని వివరించారు.
ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం ఏకసభ్య కమిటీ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అనంతపురం వచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో పలువురి నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం షెడ్యూల్ కులాల వర్గీకరణపై వివిధ కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఎస్సీల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాను రెండు జిల్లాల కలెక్టర్లు కలిశారు. సోమవారం అనంతపురం పట్టణంలోని R&B అతిథి గృహంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న తదితరులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.