India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిలమత్తూరు మండలం శెట్టిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు కూలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం సాయంత్రం స్లాబ్ నిమిత్తం అమర్చిన కట్టెలను తొలగిస్తుండగా ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, శివారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరొకరు చికిత్స పొందుతున్నారు. కాగా, అనంతపురం జిల్లా కందుర్పిలో మిద్దె కూలి <<14784951>>ముగ్గురు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే.

శ్రీ సత్యసాయి జిల్లాలో బ్యాంకర్ల భాగస్వామ్యంతో స్థిరమైన వృద్ధిరేటు సాధనకు కృషి చేద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో లక్ష్యసాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు భాగస్వాములతో సమన్వయం చేసుకొని అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతపురం రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయ లక్ష్మి తెలిపారు. ఈనెల 18 నుంచి జనవరి 17 శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. వయసు 19 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఆసక్తిగల వారు అనంతపురంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం అనంతపురం జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, 2017లో బెళుగుప్ప మండలం జీడిపల్లి, 2019లో ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. రెండ్రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పిలో మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవిగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలిలో తేమ శాతం ఉదయం 83.9% నుంచి 95.1% వరకు ఉండొచ్చని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 59.9% నుంచి 68.1% వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 5న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పర్యటిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. గురువారం ఆనంతపురం నుంచి రోడ్డు మార్గంలో పెనుకొండ కియా పరిశ్రమను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం అనంతపురంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఈ నెల 13, 14వ తేదీలలో టీడీపీ ప్రజా వేదిక వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళా కోసం 200 కంపెనీలను ఆహ్వానించామని అన్నారు. 20 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ప్రజా వేదికలో పేర్లను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏడీపీ కంపెనీ ప్రాంగణ నియామక శిబిరాన్ని ఈ నెల 5న నిర్వహిస్తోందని వీసీ కోరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరూ పాల్గొనవచ్చన్నారు. ఈ ఇంటర్వ్యూకు ఇతర కళాశాల విద్యార్థులు కూడా పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు కళాశాలలోని సంబంధిత అధికారులను కలవాలన్నారు.

ఈ నెల 10వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణ పనులలో వివిధ పాఠశాలలకు నష్టం జరిగింది. అందులో భాగంగా వివిధ పాఠశాలలకు పరిహారం కోసం మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ రోడ్డు విస్తరణ అధికారులు డీఈవో క్రిష్టప్ప పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.