Anantapur

News December 3, 2024

ప్రజా సేవకు పోలీసు ఉద్యోగానికి మించింది లేదు: ఎస్పీ

image

అనంతపురం: సమాజం కోసం పోలీసు ఉద్యోగాలకు మించింది ఏదీ లేదని జిల్లా ఎస్పీ జగదీశ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫెరెన్స్ హాల్ నందు పోలీసు ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవీ విరమణ పొందిన ఒన్ టౌన్ ఎస్ఐ ఖాదర్ బాషా, జిల్లా ఏఆర్ విభాగం ఆర్ఎస్ఐ ముస్తఫా, ఒన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

News December 3, 2024

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఓకే!

image

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుపై ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీని నిర్మాణానికి 1,200ఎకరాలు కేటాయించాలని కేంద్ర మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారును కోరినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. భూమి చూపిన వెంటనే తదుపరి కార్యాచరణ మొదలుకానుంది. అనంతపురం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భూమి కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

News December 3, 2024

బెదిరిస్తున్నారు.. మంత్రి లోకేశ్ వద్ద సత్యసాయి జిల్లా మహిళ మొర

image

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేరు చెప్పి తనను బెదిరిస్తున్నారంటూ శ్రీసత్యసాయి జిల్లా తూపల్లికి చందిన అమ్మాజీ అనే మహిళ మంత్రి లోకేశ్ వద్ద మొర పెట్టుకున్నారు. పులివెందులుకు చెందిన సాయి అనే వ్యక్తి తన నుంచి ₹40లక్షలు అప్పు తీసుకున్నాడని చెప్పారు. తిరిగి ఇవ్వమంటే అవినాశ్ రెడ్డి, వైఎస్ మధు పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. తనకు వారి నుంచి ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.

News December 3, 2024

టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. యల్లనూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని రూ.లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. టీడీపీ మెంబర్‌గా గర్వపడుతున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.

News December 2, 2024

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు: ఎస్పీ జగదీశ్

image

పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. అధికలోడ్‌తో వెళ్లడం సురక్షితం కాదన్నారు. ఈ విషయాన్ని డ్రైవర్లు, ప్రయాణికులు గుర్తించి ఓవర్లోడింగ్‌కు స్వస్తి పలకాలని కోరారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే ఆటోల్లో ప్రయాణించే ముందు, క్షణం ఆలోచించి అందుకు దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

News December 2, 2024

అనంతపురం జిల్లాలో 11,862 మంది HIV రోగులు

image

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా అనంతపురం జిల్లాలో 11,862, శ్రీ సత్యసాయి జిల్లాలో 11,089 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. 2023లో అనంతపురం జిల్లాలో 235 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 231 మంది HIV బారినపడ్డారు.

News December 2, 2024

సీఎం చంద్రబాబు గొప్ప మనసు.. కళ్యాణదుర్గం చిన్నారికి అండ!

image

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన లిఖిత అనే చిన్నారికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నేమకల్లు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. బాధితులు సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 2, 2024

ATP: ‘పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి’

image

అనంతపురం పట్టణంలోని సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తున్నామని ఆదివారం కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 9.గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రజలు నుంచి ఆర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.

News December 1, 2024

ATP: చింతలాయపల్లిలో ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి

image

అనంతపురం (D) యాడికి మం. చింతలాయపల్లిలో ఆదివారం విషాదం ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామకృష్ణ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. రామకృష్ణ, రామాంజనేయులు ఇద్దరూ ట్రాక్టర్లో గ్రామ శివారులో పునాది రాళ్లు తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ లోడ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ఉన్న పళంగా ముందుకొచ్చి రామకృష్ణపై దూసుకెళ్లింది. దీంతో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 1, 2024

అనంత: ముగ్గురు మృతి.. ఐఫోన్ పంపిన SMSతో పోలీసుల అలెర్ట్

image

విడపనకల్లు వద్ద జరిగిన విషాద ఘటన అందరినీ కలిసివేసింది. బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లి తిరిగి బెంగళూరు నుంచి బళ్లారి వెళ్తున్న సమయంలో కారు చెట్టును ఢీకొని ముగ్గురు మృతిచెందారు. కాగా, ప్రమాదం జరిగాక మృతుల ఐఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు SMS వెళ్లింది. మెసేజ్ రాగానే GPS ఆధారంగా ప్రమాద స్థలాన్ని కనుగొని బళ్లారి నుంచి బయలుదేరారు. తమ వాళ్లు ఆపదలో ఉన్నారంటూ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.