India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంలో కలెక్టర్ టీఎస్ చేతన్ ర్యాలీని ప్రారంభించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా వైద్యాధికారి మంజు వాణి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎయిడ్స్ నియంత్రణ ర్యాలీని విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు, ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనంతపురం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం రికార్డు స్థాయిలో కొనసాగింది. ఆదివారం ఉదయం 9:30 గంటల సమయానికి 96.57 శాతంతో అనంత జిల్లా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 2,81,637 మందికి గాను 2,71,968 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ నగదును అందజేశారు. దీంతో అనంతపురం జిల్లా 96.57 శాతంతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచి ఔరా అనిపించింది.

అనంతపురం జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విడపనకల్లు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు యోగేశ్, గోవిందరాయ బళ్లారి ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులుగా, అమరేశ్ డ్రైవర్‌గా పోలీసులు మరో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారికి తరలించారు.

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో భాగంగా చేపట్టిన క్లెయిమ్‌లు పరిష్కారం పక్కాగా జరగాలని ఎన్నికల పరిశీలకులు కన్నబాబు పేర్కొన్నారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో ఓటరు జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఓట్ల తొలగింపులకు అందిన క్లెయిమ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని ఫార్మా డీ పోస్ట్ బ్యాకలోరియెట్ 1, 2వ సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

బొమ్మనహళ్ మండలం నేమకల్లులో జరిగిన సీఎం చంద్రబాబు బహిరంగ సభ విజయవంతమైనట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. పోలీస్ సిబ్బంది అన్ని రకాల భద్రత చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారన్నారు. శాంతి భద్రతలు నిర్వహించిన సిబ్బందికి ,విఘాతం కలగకుండా సహకరించిన ప్రజానీకానికి ఎస్పీ, డీఐజీ కృతజ్ఞతలు తెలిపారు.

గర్భస్థ లింగనిర్ధారణ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో అనాథ పిల్లలను గుర్తించాలన్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు కొత్తగా 5 PHCలు, శ్రీ సత్యసాయి జిల్లాకు 4 PHCలు మంజూరు అయ్యాయి. కొత్త పీహెచ్‌సీల మంజూరుపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు నేమకల్లు చేరుకుంటారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్ మొత్తం అందజేస్తారు. తర్వాత నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ప్రజావేదికలో స్థానికులతో ముఖాముఖి అనంతరం తిరుగుపయనం అవుతారు.

బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. పుట్లూరులో 2020లో 6ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా నిందితుడు అత్యాచారం చేశాడని అమ్మమ్మ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.3 వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.