India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 774 హెక్టార్లలో వివిధ పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 27 హెక్టా ర్లు పత్తి 16 హెక్టార్లు వేరుశనగ 346 హెక్టార్లు కొర్ర 7 హెక్టార్లు వీటితో పాటు ఇతర ఇతర పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో రానున్న నాలుగు రోజులలో కురువనున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండుగా ప్రవహించే అవకాశం ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు చేపట్టాలని, కర్ణాటకలోని పరగోడు నిండి పొర్లుతున్నందున చిలమత్తూరు, గోరంట్ల, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
బుడమేరు విజయవాడను ముంచెత్తితే.. పండమేరు అనంతపురంపై విరుచుకుపడింది. నగర శివారులోని ఈ వాగు అర్ధరాత్రి కుండపోత వర్షానికి ఉద్ధృతంగా ప్రవహించి సుమారు ఐదు కాలనీలను ముంచెత్తింది. ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వాహనాలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతోనే పండమేరుకు భారీ వరద వచ్చినట్లు తెలుస్తోంది. అధికారుల ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టం జరగలేదు.
భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద అనంత సాగర చెరువు మరువను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో ఉండాలని సూచించారు. చెరువు మరువ పారే పరిసరాల ప్రాంతాలలో ప్రజలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలో అర్ధరాత్రి గ్రామ చెరువు తెగిపోవడంతో లావణ్య అనే మహిళకు చెందిన 70 గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయి. తన ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురితో కలిసి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదని బాధితురాలు వాపోయారు. 80లో పదింటిని మాత్రమే కాపాడుకోగలిగామని చెప్పారు. కాగా ఈమె భర్త మాధవయ్య 5 రోజుల క్రితం మృతిచెందగా, పెద్దకొడుకు పాముకాటుతో ఇటీవల చనిపోయాడు.
కల్యాణదుర్గం పట్టణ శివారులోని కంబదూరు రోడ్డులో రామన్న తోటలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో కొబ్బరి చెట్టు దెబ్బతినింది. పిడుగు శబ్దానికి స్థానిక రైతులు పరుగులు తీశారు. భారీ వర్షానికి తోడు పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు దెబ్బతినింది. రెండు రోజుల క్రితం సెట్టూరు మండల పరిధిలో కూడా పిడుగు పడి ఓ కొబ్బరి చెట్టు పూర్తిగా దెబ్బతినింది.
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని మైనర్, మీడియం ఇరిగేషన్ సంఘాలకు త్వరలో ఎన్నికల నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 214 మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ 16 సంఘాలు ఉన్నాయని, నవంబర్ 21 నుంచి 23 లోపు ఎన్నికలను నిర్వహించనున్నామని తెలిపారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి పుట్టపర్తి, అనంతపురం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెట్లు, టవర్లు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది.
ఏపీ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, వైఎస్సార్ క్యాబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఇంటికే పరిమితం కాగా ఆయనపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘జూటూరు రాజు’ టైటిల్‌తో ఓ డైరెక్టర్ జేసీ ఫ్యామిలీతో చర్చలు జరుపుతున్నారట. నటుడు రాజేంద్రప్రసాద్ దివాకర్ రెడ్డి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
2022 మార్చి 26న భాకరాపేట వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా కలెక్టర్ ఆర్థిక సహాయం అందజేశారు. అప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో పది మంది మృతి చెందగా 41 మంది క్షతగాత్రులు అయ్యారు. కలెక్టర్ చొరవతో ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు వారి వ్యక్తిగత ఖాతాలలో జమ చేయించారు.
Sorry, no posts matched your criteria.