Anantapur

News October 21, 2024

రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా?: వైసీపీ జిల్లా అధ్యక్షుడు

image

అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, అసలు ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 74 మంది చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

News October 21, 2024

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు అనంత విద్యార్థి ఎంపిక

image

జాతీయ స్థాయి రైఫిల్ షూట్ పోటీలకు అనంతపురం విద్యార్థి తీక్షణ్ సాయి ఎంపికయ్యారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన రాష్ట్రస్థాయి రైఫిల్ షూట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.  తీక్షణ్ సాయి 9వ తరగతి చదువుతున్నట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు.

News October 21, 2024

పంచాయతీల మధ్య ప్రతిపాదిత పోటీకి మార్గదర్శకాల నిర్వహణ: కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలలో సంతృప్తతను సాధించడంపై దృష్టి సారించి పంచాయతీల మధ్య పోటీని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. 2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ప్రత్యేక అతిథిగా సర్పంచ్‌ల ఆహ్వానం కోసం పంచాయతీల మధ్య పది ప్రధాన పథకాలపై పోటీ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

News October 21, 2024

పురుగులు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

గార్లదిన్నె మండలం కణంపల్లి గ్రామ సమీపంలోని గుట్టలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గార్లదిన్నె ఎస్ఐ మహమ్మద్ గౌస్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 21, 2024

తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోండి: కలెక్టర్‌కు వినతి

image

తుఫాను ప్రభావంతో శ్రీ సత్యసాయి జిల్లాలోని 32 మండలాల్లో సాగుచేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ చేతన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం పుట్టపర్తిలో కలెక్టర్‌ను రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వేమ నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య కలిశారు. జిల్లాలో రైతులు సాగుచేసిన వివిధ పంటలు, నష్టాలను రైతుల సాధక బాధకాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

News October 21, 2024

క్రమ శిక్షణకు మారు పేరు పోలీసులు: కలెక్టర్

image

క్రమశిక్షణకు మారు పేరు పోలీసులు అని అనంతపురం కలెక్టర్ వినోదకుమార్ పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని తెలిపారు. పోలీసుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని తెలిపారు. ప్రజలను కాపాడుతున్న పోలీసులకు ఆయన సెల్యూట్ చేశారు.

News October 21, 2024

ATP: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. విజయలక్ష్మి అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలిని రుద్రేశ్ అనే వ్యక్తి 2018 సెప్టెంబర్ 5న కూడేరు మండలం ఉదిరిపి కొండ వద్ద హత్య చేశాడు. పలు దఫాల విచారణల అనంతరం నేరం రుజువు కావవడంతో నిందితుడు రుద్రేశ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు చెప్పారు.

News October 21, 2024

రేపు అనంతపురానికి సినీ నటుడు నాగార్జున

image

సినీ నటుడు అక్కినేని నాగార్జున రేపు అనంతపురానికి వస్తున్నారు. నగరంలో రేపు జరగనున్న ఓ జువెలర్స్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ‘నేను అనంతపురం వస్తున్నా. రేపు అందరం కలుసుకుందాం’ అంటూ నాగార్జున ఓ వీడియో విడుదల చేశారు. సూర్య నగర్‌లో రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 

News October 21, 2024

రేపు అనంతపురానికి సినీ నటుడు నాగార్జున

image

సినీ నటుడు అక్కినేని నాగార్జున రేపు అనంతపురానికి వస్తున్నారు. నగరంలో రేపు జరగనున్న ఓ జువెలర్స్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ‘నేను అనంతపురం వస్తున్నా. రేపు అందరం కలుసుకుందాం’ అంటూ నాగార్జున ఓ వీడియో విడుదల చేశారు. సూర్య నగర్‌లో రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 

News October 21, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.45

image

అనంతపురంలో టమాటా ధరలు నిలకడగా ఉన్నాయి. నగర శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో గరిష్ఠంగా రూ.45 పలికింది. కనిష్ఠంగా రూ.25, సరాసరి రూ.36తో క్రయవిక్రయాలు జరిగాయి. మరోవైపు ఇటీవల వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో పంట దెబ్బతినింది.