India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో పిడుగు పడింది. కరిగానిపల్లి గ్రామ శివారులోని రామచంద్రప్ప అనే రైతు వ్యవసాయ తోటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడగా చెట్టు దెబ్బతినింది. భారీ శబ్దానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే హిందూపురం మండలం పోచనపల్లిలో పిడుగుపాటుకు గురై లక్ష్మయ్య అనే రైతు మృతి చెందిన విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రి సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం శిల్పకళా సంపదకు నిలయంగా బాసిల్లుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన క్షేత్రంలో శివలింగం నుంచి నీరు ఎల్లప్పుడూ ఉబికి రావడం, అమ్మవారి మండపానికి ఏర్పాటుచేసిన రాతి స్తంభాలు సప్తస్వరాలు పలకడం ఇక్కడ ప్రత్యేకత. సాయంత్రం వేళలో క్షేత్రం ఎలా ఉందో మీరే చూడండి..!
అనంతపురం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపత్రి మండల పరిధిలోని చుక్కలూరు గ్రామ సమీపంలో తాడిపత్రి-గుత్తి ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. నలుగురు వ్యక్తులు రెండు బైకులపై బత్తలపల్లి మండలం రామాపురంలోకి ప్రవేశించారు. ఈక్రమంలో వారి వెనుకే రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వాళ్లు పక్కకు తప్పుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పులు చేసింది పోలీసులని.. ఆ నలుగురు దొంగలని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఈనెల 12న అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ కావడంతో కేసు విచారణ చురుగ్గా జరుగుతోంది. ఇందులో భాగంగా బాధితులైన అత్త, కోడలిని ఉరవకొండకు శనివారం తీసుకు వచ్చారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి దుర్గాకళ్యాణి వారి వాంగ్మూలం నమోదు చేశారు. ఈప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు.
ధర్మవరంలోని బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య, మంత్రి సత్యకుమార్, తదితరులు హాజరయ్యారు. లాల్ సింగ్ ఆర్య మాట్లాడుతూ.. 45 రోజుల్లోనే 9 కోట్లకు పైగా సభ్యత్వాలతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీల్లో ఒకటిగా బీజేపీ నిలిచిందన్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం రేపటితో పూర్తవనుంది. ఈ నెల 14 నుంచి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అధికారులు, నేతలు శంకుస్థాపన చేశారు. ఆగస్టు 23న గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ₹4500కోట్లు కేటాయించగా పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరి మీ ఊర్లో పల్లె పండుగ కార్యక్రమం జరిగిందా? అభివృద్ధి పనులు మొదలయ్యాయా.. కామెంట్ చేయండి..
గుత్తి యువతి జాక్‌పాట్ కొట్టారు. భారీ ప్యాకేజీతో జాబ్ దక్కించుకున్నారు. గుత్తిలోని ప్రభుత్వ న్యాయవాది తిమ్మారెడ్డి, పార్వతి దంపతుల కుమార్తె జ్యోత్స్న అమెరికాలోని బ్రిడ్జ్ ఫోర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లెస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనగా విన్నే బాగో అనే కంపెనీ ఏడాదికి రూ.1.20కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం రేపటితో పూర్తవనుంది. ఈ నెల 14 నుంచి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అధికారులు, నేతలు శంకుస్థాపన చేశారు. ఆగస్టు 23న గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ₹4500కోట్లు కేటాయించగా పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరి మీ ఊర్లో పల్లె పండుగ కార్యక్రమం జరిగిందా? అభివృద్ధి పనులు మొదలయ్యాయా.. కామెంట్ చేయండి..
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇటీవల అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు అధ్యక్షులుగా అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్‌ను నియమించగా తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే మిథున్ రెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.
Sorry, no posts matched your criteria.