India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీ సత్య సాయి జిల్లాలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల స్థాపనకు సంబంధించిన సర్వే పక్కగా జరగాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి సర్వే పనితీరు, నిర్వహణ, టర్నోవర్ తదితర అంశాలపై చర్చించారు. వాణిజ్య, వ్యాపార సేవా రంగ సంస్థలు, ఉత్పత్తిదారులకు ఎంఎస్ఎంఈ సర్వేపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

ముదిగుబ్బ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. నాగిరెడ్డిపల్లికి చెందిన గంగన్న, నరసమ్మ రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొంది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు పట్నం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న మెగా పేరెంట్స్, టీచర్ల సమావేశం నిర్వహించాలని కలెక్టర్ చేతన్ తెలిపారు. విజయవాడ నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. చదువుకునే విద్యార్థులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 5 పాఠశాలలు ఎంపిక చేసి అందించనున్నట్లు వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా ఎమ్మెల్యేలు గళమెత్తారు. సమస్యలు, అభివృద్ధి పనులపై మాట్లాడారు. పలురువు అభివృద్ధి పనులపై సీఎంకు వినతి పత్రాలు అందజేశారు.
★ <<14669898>>పుట్టపర్తి<<>> ★ <<14670254>>రాప్తాడు<<>> ★ <<14670336>>శింగనమల<<>> ★ <<14671412>>గుంతకల్<<>> ★ <<14671419>>రాయదుర్గం<<>> ★ <<14673803>>మడకశిర<<>> ★ <<14675835>>కళ్యాణదుర్గం<<>>
☛ పైన మీ నియోజకవర్గంపై క్లిక్ చేసి మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారో తెలుసుకోండి.

అనంతపురం జిల్లాలో కిలో టమాటా ధర రూ.28 పలుకుతోంది. కక్కలపల్లి టమాటా మార్కెట్లో కిలో గరిష్ఠంగా రూ.28తో అమ్ముడుపోయినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. నిన్న మార్కెట్‌కు 675 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయన్నారు. కిలో సరాసరి ధర రూ.23, కనిష్ఠ ధర రూ.16 పలికినట్లు వెల్లడించారు.

చిన్నారితో కలిసి అమ్మానాన్న బలవన్మరణానికి పాల్పడిన <<14671020>>ఘటన<<>> నార్పలలో జరిగిన విషయం తెలిసిందే. కృష్ణకిషోర్, శిరీషారాణి దంపతుల ఆత్మహత్యకు అప్పులు, అనారోగ్యమే కారణమని శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈఘటనలో చిన్నారి మృతి అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆ దంపతులు చిన్నారికి విషం ఇచ్చారా? లేక ఆకలితో చనిపోయిందా? అన్నది పోస్టుమార్టం తర్వాత తెలియనుంది.

‘పోరాటం మన నాయకుడు వైఎస్ జగన్‌కి, వైసీపీకి కొత్తేమీ కాదు. కూటమి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టినా బలంగా నిలబడదాం. ప్రజల పక్షాన నిలుస్తూ వారి గొంతుకవుదాం’ అంటూ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ లీగల్ సెల్, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు.

అనంతపురం జిల్లా నార్పలలో కుటుంబం మెుత్తం ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణ కిషోర్ (45), శిరీష రాణి (35) అనే దంపతులు తమ ఆరు నెలల బాలుడితో కలిసి ఇంట్లో ఉరేసుకుని మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. త్వరలోనే ఘటనకు గల కారణాలను వెల్లడిస్తామని ఎస్ఐ సాగర్ తెలిపారు.

ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై ఈనెల 26న సీపీఎం ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు రామంజి నేయులు పిలుపు నిచ్చారు. సోమలదొడ్డి IML డిపో దగ్గర హమాలీలతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధర్నాకు కార్మికులు ,రైతులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

వెనుకబడిన ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం అని ఎమ్మెల్యే శ్రీనివాసులు అసెంబ్లీలో పేర్కొన్నారు. జైసల్మేర్ ఎడారి అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారని, కానీ నియోజకవర్గంలో 20వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణ పరిస్థితులున్నాయన్నారు. సినిమాల్లో ఎడారి దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించుకుంటారన్నారు. అలాంటి ఎడారీకర నివారణ కోసం నిధులు కేటాయించాలని కోరగా, ‘ఎడారీకరణ మంచి పదం’ అని Dy స్పీకర్ కితాబిచ్చారు.
Sorry, no posts matched your criteria.