Anantapur

News May 22, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

image

అనంతపురంలోని కురుగుంట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కమరుపల్లి గ్రామానికి చెందిన వంశీ, ప్రశాంత్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వంశీ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 22, 2024

వైసీపీ పాలనకు అన్నదాతల ఆత్మహత్యలే నిదర్శనం: సత్యకుమార్

image

సీమవాడినని చెప్పుకోనే సీఎం జగన్.. ఐదేళ్లుగా సీమలో నీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విమర్శించారు. రైతులకు వరం లాంటి బిందుసేద్యం పథకం అటకెక్కించారన్నారు. కరవు దెబ్బకు కుదేలైన రైతుకు సకాలంలో పంట నష్టపరిహారమైనా అందించి ఉంటే రైతుల ప్రాణాలు నిలిచేవన్నారు. ఉమ్మడి జిల్లాలో వారంలోనే అప్పులబాధ తాళలేక నలుగురు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు.

News May 22, 2024

సత్యసాయి జిల్లాలో 66.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 32 మండలాలకు గాను 6 మండలాలలో వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షపాతం మండలాలు వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. అమడగూరులో 20.5, ఓడిసిలో 16.2, గోరంట్లలో 11.0, తనకల్లులో 6.8, తలపులలో 6.2, నల్లచెరువు మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

News May 22, 2024

అనంత జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటల నష్టం రూ.1.84 కోట్లు

image

అనంత జిల్లాలో గాలివానతో కూడిన వర్షంతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. యల్లనూరు, యాడికి, కూడేరు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, కుందుర్పి, శెట్టూరు, ఉరవకొండ, అనంతపురం, బెళుగుప్ప మండలాల్లో అరటి తోటలు నేలవాలగా, మామిడి, టమాటో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. 33మంది రైతులకు చెందిన 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రూ.1.84 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

News May 22, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్ష సూచన

image

ఉమ్మడి అనంత జిల్లాలో ఈనెల 25న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం కురుస్తుందన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్‌లలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News May 22, 2024

అనంతపురం: డిప్లమో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ షిప్

image

అనంతపురం పట్టణ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో(మెకానికల్) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు “మస్సాచు సిమిచ్చు” కంపెనీలో ఆరు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాంను అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయచంద్ర రెడ్డి తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు రూ.18వేల స్టైఫండ్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News May 22, 2024

6,289 మందిని బైండోవర్ చేసిన పోలీసులు

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి 6,289 మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో 381మందిని బైండోవర్ చేశామని వెల్లడించారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, కిరాయి హంతక ముఠా, సమస్యలు సృష్టించే 136మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

News May 22, 2024

పుట్టపర్తి: 24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ

image

పుట్టపర్తిలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7344మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు 9గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు.

News May 22, 2024

అనంతపురం: 8మంది జిల్లా బహిష్కరణ

image

అనంతపురం జిల్లాలో మట్కా, కర్ణాటక మద్యం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 8మందిని జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పలుమార్లు కేసులు నమోదుచేసినా తరచూ కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వారిపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. అందులో అనంతపురం, బెలుగుప్ప, గార్లదిన్నె మండలాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు.

News May 22, 2024

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 34 కేంద్రాలు

image

అనంతపురం జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డివీఈఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. ప్రథమ సంవత్సరం 15,921, ద్వితీయ సంవత్సరం 5,017, వృత్తిపరమైన ప్రథమ సంవత్సరం 980, ద్వితీయ సంవత్సరం 592మంది హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.