Anantapur

News May 21, 2024

ఉమ్మడి అనంత జిల్లాలోని ఐటిఐ అభ్యర్థులకు శుభవార్త

image

అనంతపురం జిల్లాలోని ఐటిఐ అభ్యర్థులకు ఈనెల 23న ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. హోండా మోటార్, స్కూటర్ ఇండియా సంస్థలు ప్రాంగణ నియామకాలకు హాజరవుతాయన్నారు. ఐటిఐ చదువుతున్న, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10గంటలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.

News May 21, 2024

అనంతలో ఇంటర్ అడ్వాన్స్‌‌డ్ పరీక్షలకు 22,510మంది విద్యార్థులు దరఖాస్తు

image

అనంతపురం జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 22,510 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 15,921మంది, ఒకేషనల్ విద్యార్థులు 980మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,017మంది, ఒకేషనల్ విద్యార్థులు 592 మంది ఉన్నారు. 34 కేంద్రాలకు గాను అనంతపురం నగరంలోనే 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆర్‌ఓ వెంకటరమణ తెలిపారు.

News May 21, 2024

సబ్సిడీ వేరుశనగ కోసం 10,205మంది రైతులు రిజిస్ట్రేషన్

image

అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లో సబ్సిడీ వేరుశనగ కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో 10,205 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. విత్తన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 9,077 క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుందని తెలిపారు. ఈ మేరకు రైతులకు సబ్సిడీపై వేరుశనగలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

News May 21, 2024

అనంతపురంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

image

అనంతపురంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలో గాలివానకు 40 చెట్లు విరిగిపడటంతో పాటు 30 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో నగరంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు 75 శాతం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు చెట్లు, స్తంభాలు పడిపోయిన ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News May 21, 2024

కౌంటింగ్ రోజు రిటర్నింగ్ అధికారులే కీలక పాత్ర పోషించాలి: కలెక్టర్

image

కౌంటింగ్ రోజు రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జూన్ 6 తేదీ వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే నిర్వహించాలన్నారు. 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్‌లో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ మేరకు వారితో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

News May 21, 2024

పురాతన కట్టడాల ప్రాముఖ్యతను వెలుగులోనికి తీసుకురావాలి: అనంత కలెక్టర్

image

జిల్లాలోని పురాతన కట్టడాల ప్రాముఖ్యతను వెలుగులోనికి తీసుకురావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనల శాలల శాఖ, ఇంటాక్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాల్గొన్నారు.

News May 20, 2024

శ్రీసత్యసాయి: పిడుగు పాటుతో వ్యక్తి మృతి

image

బత్తలపల్లి మండలంలో పిడుగు పాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఉప్పర పల్లి సమీపంలో పిడుగు పడడంతో జింక చలపతి అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News May 20, 2024

తాడిపత్రి అల్లర్లపై 7 కేసులు నమోదు

image

ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై 7 కేసులు నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అందులో 728మంది ముద్దాయిలు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 396 మందిని గుర్తించగా 332మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 91మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

News May 20, 2024

కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు

image

కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత పేర్కొన్నారు. ఈ యాక్ట్ ప్రకారం ప్రజలు, రాజకీయ పార్టీలు, ఏ ఇతర సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 20, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఉరవకొండ మండలం పాల్తూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో విడపనకల్ మండలానికి చెందిన మల్లికార్జునాచారి (65) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉండబండ నుంచి ఉరవకొండకు వెళ్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.