Anantapur

News May 19, 2024

‘వజ్రకరూరులో వాన పడింది. వజ్రాల వేట మొదలైంది’

image

వజ్రకరూరు మండలంలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వజ్రాల అన్వేషణ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందని ఆశతో వెతుకుతున్నారు. ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందస్తుగా రావడంతో వజ్రాల వేట మొదలైంది.

News May 18, 2024

గుంతకల్లు: ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

image

గుంతకల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

News May 18, 2024

అనంతపురం నూతన ఎస్పీగా గౌతమి శాలి

image

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన అమిత్ బర్దర్‌ను ఎన్నికల ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంగతి విదితమే. నూతన ఎస్పీ గౌతమి శాలి వెంటనే వెంటనే విధుల్లో చేరాలని అదేశాల్లో పేర్కొన్నారు.

News May 18, 2024

బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

అనంతపురము జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు అనంతపురం ఆంధ్రపదేశ్ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాదించిన వారికి మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు శనివారం సంచాలకులు ఖుష్బూ కొఠారి ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీకి చెందిన అభ్యర్థులు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, ఉచిత మెటీరియల్‌ను అందిస్తామన్నారు.

News May 18, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన అధికారులు

image

హిందూపురం సమీపంలో గల బిట్ కళాశాలలో ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను శనివారం అధికారులు పరిశీలించారు. అక్కడ ఎలాంటి భద్రత ఉంది, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి హిందూపురం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ, కదిరి ఆర్వోలు అపూర్వ భరత్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

News May 18, 2024

BREAKING: అనంత జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

image

గుత్తి మండలం బాట సుంకులమ్మ దేవాలయం సమీపంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు అనంతపురం రాణి నగర్‌కు చెందిన వారుగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

News May 18, 2024

గెలుపు మనదే.. ప్రశాంతంగా ఉండండి: పరిటాల సునీత

image

గెలుపు మనదేనని, ప్రశాంతంగా ఉండాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆమెను కలిశారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని మండలాల్లో టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తల కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

News May 18, 2024

సత్యసాయి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్నికల అధికారి

image

సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల నిల్వ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ఎన్నికల అధికారి ముఖేశ్ మీనా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ కొండయ్యలతో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.

News May 17, 2024

కంబదూరు: తల్లిని చంపిన కేసులో తనయుడి అరెస్ట్

image

కంబదూరు మండలం వైసీపల్లి గ్రామానికి చెందిన సుంకమ్మను చంపిన ఆమె తనయుడు వెంకటేశులును అరెస్టు చేసినట్లు కళ్యాణదుర్గం రూరల్ సీఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వైసీపల్లికి చెందిన వెంకటేశ్ తన తల్లి సుంకమ్మ తలను గ్యాస్ బండకు గుద్దడంతో చనిపోయిందని తెలిపారు. ఆమె భర్త రామదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడైన వెంకటేశులును అరెస్టు చేశామని వెల్లడించారు.

News May 17, 2024

సత్యసాయి జిల్లాలో పోలీసుల అదుపులోకి 36మంది

image

సత్యసాయి జిల్లాలో 36 మందిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. చిల్లమత్తూరు మండలం హుస్సేన్‌పురం గ్రామంలో పోలింగ్ రోజున వైసీపీ-టీడీపీ శ్రేణులు ఘర్షణ పడ్డాయి. ఘర్షణకు కారకులైన ఇరువర్గాలకు చెందిన 36మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.