Anantapur

News May 17, 2024

మట్టి పెళ్లలు పడి వ్యక్తి మృతి

image

గుమ్మగట్ట మండలం ఆర్.కొత్తపల్లి గ్రామ చెరువులో ఇసుక తవ్వుతుండగా రాజశేఖర్ అనే వ్యక్తిపై మట్టి పెళ్లలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గలగల గ్రామానికి చెందిన రాజశేఖర్ ట్రాక్టర్‌లో కూలి పనికి వెళ్లాడు. ఆర్.కొత్తపల్లి చెరువులో ఇసుక తవ్వుతుండగా మట్టి పెళ్లలు మీద పడ్డాయి. దీంతో ఊపిరాడక రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News May 17, 2024

రైలు పట్టాలపై మృతదేహం లభ్యం

image

హిందూపురం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ తెలిపారు. విధుల్లో ఉన్న కీమేన్ సమాచారం మేరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 ఏళ్లు పైబడి వయసున్న యువకుడు బూడిదరంగు నైట్ ప్యాంటు, కుడిచేతికి కాషాయం తాడు కట్టినట్లు ఆనవాళ్లున్నాయన్నారు.

News May 17, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

image

బీ.సముద్రం మండలం ఒడియం పేట సమీపంలో శుక్రవారం గేదెను ఆటో ఢీకొని వెనమల్ల ఆచారి(53) మృతిచెందాడు. గార్లదిన్నెకు చెందిన ఆచారి, నారాయణస్వామి కత్తులు అమ్మడానికి ఆటోలో అనంతపురానికి వెళ్తున్నారు. వడియం పేట వద్ద గేదెను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎనుముల ఆచారి మృతిచెందాడు.

News May 17, 2024

స్ట్రాంగు రూంల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండండి: అనంతపురం డీఎస్పీ

image

అనంతపురం జిల్లాలోని JNTUలో భద్రపరిచిన EVM స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం డీఎస్పీ ప్రతాప్, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజు ఆదేశించారు. జిల్లా ఎస్పీ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూముల వద్ద సాయుధ పోలీసులచే గార్డులు నిర్వహిస్తూ నిరంతర భద్రత (24×7) కల్పిస్తున్నారు. JNTU వద్ద ఫుట్ పెట్రోలింగ్, వజ్ర వాహనం ద్వారా గస్తీ కొనసాగిస్తున్నారు.

News May 16, 2024

అనంతపురం ఎస్పీ, తాడిపత్రి డీఎస్పీపై ఈసీ వేటు

image

అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను సస్పెండ్ చేస్తూ జాతీయ ఎన్నికల కమిషన్ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఈసీ సీరియస్‌గా పరిగణించింది. అలాగే తాడిపత్రి డీఎస్పీ, సీఐతో పాటు పలువురు పోలీసులను సస్పెండ్ చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది.

News May 16, 2024

జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని హైదరాబాద్‌కు తరలింపు

image

జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు అత్యంత భద్రత సిబ్బంది నడుమ తాడిపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి భార్య, ఆయన సోదరి అనారోగ్యంగా ఉన్నారు. ఈ స్థితిలో పనివారు కూడా లేకపోవడంతో జేసీ పవన్ తన కుటుంబాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు రక్షణ కల్పించారు.

News May 16, 2024

రూడ్ సెట్ సంస్థలో కార్ డ్రైవింగ్, మెకానిక్‌‌పై ఉచిత శిక్షణ

image

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో ఈ నెల 20 నుంచి 30రోజుల పాటు యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్‌పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు గురువారం డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాలని సూచించారు.

News May 16, 2024

అనంతపురం: ఓట్లు వేయని వారి సంఖ్య ఇదే

image

➤అనంతపురం:98,195 ➤ఉరవకొండ:31,898
➤గుంతకల్లు:66,828 ➤తాడిపత్రి: 42,179
➤శింగనమల:41,731 ➤రాయదుర్గం:37,163
➤కళ్యాణదుర్గం: 26,488 ➤రాప్తాడు: 37,364
➤మడకశిర: 26,446 ➤హిందూపూర్: 55,269
➤పెనుకొండ: 30,783 ➤పుట్టపర్తి: 28,969
➤ధర్మవరం: 27,462 ➤కదిరి: 47,215

News May 16, 2024

టీడీపీ తొత్తుగా ఏఎస్పీ: MLA పెద్దారెడ్డి

image

తాడిపత్రి ఘర్షణలపై MLA పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాడిపత్రి లోని మా ఆఫీసు వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి డోర్లు బద్దలు కొట్టారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారు. ASP రామకృష్ణ TDPకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఆయన అండతోనే JC ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయి తాడిపత్రిలో గొడవలు సష్టిస్తున్నారు. వీరందరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తా. వాళ్లని సస్పెండ్ చేయాలి’ అని MLA కోరారు.

News May 16, 2024

సుంకమ్మ హత్యలో రాజకీయ కోణం లేదు: CI

image

అనంతపురం జిల్లా కంబదూరు(M) వైసీపల్లిలో సుంకమ్మ హత్యలో రాజకీయ కోణం లేదని కళ్యాణదుర్గం రూరల్ ఇన్‌ఛార్జ్ CI హరినాథ్ స్పష్టం చేశారు.‘ఓ స్థలం విషయంలో సుంకమ్మ, భర్త రామదాసు గొడవ పడ్డారు. ఆమె భర్తను కట్టెతో కొట్టింది. ఎందుకు కొట్టావని కుమారుడు వెంకటేశ్ తల్లిని నిలదీశాడు. ఆమె ఎదురు తిరగడంతో వెంకటేశ్ గ్యాస్ బండకు గుద్దడంతో సుంకమ్మ చనిపోయింది. రామదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం’ అని సీఐ చెప్పారు.