India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగట్టువారిపల్లెలో చేనేత మగ్గానికి ఉరివేసుకుని ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన సీ.హరి(45) మారుతీ నగర్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో నేడు ఆయన చేనేత మగ్గానికి ఉరివేసుకుని మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫుట్‌బాల్ ఇండియా జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన అనిల్ కుమార్ ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పెద్దపప్పూరు మండలం కుమ్మెత సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. త్వరలో గోవాలో జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు.

రానున్న మూడు రోజులు పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు అనంతపురం సమీపంలోని రేకులకుంట వ్యవసాయ క్షేత్రం నుంచి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు నారాయణస్వామి, విజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదని డీఈవో కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈనెల 11వ తేదీలోపు ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల ధృవీకరణకు జిల్లాలో ఎక్కువగా పెండింగ్ ఉన్న కంబదూరు, కుందుర్పి మండలాల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.

ఏపీలో ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరం లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

ఈనెల 10న జరగాల్సిన ఎస్సీ, ఎస్టీల ఉచిత డీఎస్సీ స్క్రీనింగ్ ఆన్‌లైన్ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల పరీక్ష వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తరువాత పరీక్ష తేదీని తెలియజేస్తామన్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 16మందికి ఏఈవోలుగా ఉద్యోగోన్నతి కల్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. గోరంట్ల, తనకల్లు, bk సముద్రం, కుందుర్పి, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, పామిడి, ఆమడగూడూరు, బత్తలపల్లి, పరిగి, కనేకల్, శింగనమల, విడపనకల్లు, వజ్రకరూరు, ముదిగుబ్బ, రామగిరికి వారిని కేటాయించామన్నారు.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిక్కవడియార్ చెరువులో ఆక్రమణలు జరిగాయని, ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు 20 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం.

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈ నెల 9న సాయంత్రం 4:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనంతపురంలోని త్రివేణి థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.