India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు సంబంధించి జిల్లా, మండల కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో వంద రోజులు ప్రణాళికపై, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సరించాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో నవరాత్రులు పూర్తి అయ్యేవరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. నవరాత్రులు పూర్తి అయ్యేవరకు జిల్లాలో డీజేలు, డాన్సులు, బాణసంచా కాల్చడం, ఊరేగింపులు పూర్తిగా నిషేధం విధించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, ఎవరు అతిక్రమించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దసరా సెలవులలో పాఠశాలలు, కళాశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. నేటి నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సందర్శించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు.
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కేంద్ర ప్రభుత్వం లేబర్, టెక్స్ టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
తననకు ఉద్దేశించి ‘కాస్త ఓపిక పట్టు.. నీ గుట్టు విప్పుతా’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మాయల మరాఠీ.. నీ దౌర్జన్యాలతో ధర్మవరంలో చింద్రమైన చేనేత, రైతు, కార్మికుల బతుకులకు.. నీ పదవికి న్యాయం చేయు. తర్వాత మన లెక్కలు తేల్చుకుందాం. ఏమీలేని నా గుట్టు విప్పుదువులే. అక్రమాలతో కూడిన 20ఏళ్ల నీ ఢిల్లీ గుట్టు నేను విప్పుతా’ అని కేతిరెడ్డి ట్వీట్ చేశారు.
సినీ హీరోయిన్లు పాయల్ రాజపుత్, నబా నటేశ్ రేపు అనంతపురం రానున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు. తమ అభిమాన హీరోయిన్లు వస్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురంలో కిలో రూ.70కి పైగా పలుకుతోంది. మూడో రకం సైతం రూ.50 పలుకుతుండటం విశేషం. నిన్న కక్కలపల్లి టమాటా మార్కెట్‌కు 675 టన్నులు రాగా గరిష్ఠంగా కిలో రూ.74, రెండో రకం రూ.65తో విక్రయాలు సాగాయి. 15 కిలోల బుట్ట నాణ్యతను బట్టి రూ.750 నుంచి రూ.1,110 వరకు పలుకుతోందని మార్కెట్ కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. టమాటా కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని కప్పల బండలో జరిగిన స్వచ్ఛత హి సేవ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు.
బీ.సముద్రం మండల పరిధిలో ఉన్న హెచ్ఎల్‌సీ కెనాల్‌లో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడీమేడ్ ఫుల్ షర్ట్‌పైన నలుపు, తెలుపు రంగు చుక్కలు, డార్క్ బ్లూ కలర్ జీన్స్ దుస్తులు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కీప్యాడ్ ఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉందన్నారు. గుర్తించి వారు సీఐ 9440796816 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన విమర్శలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత మీకు సరిగ్గా వర్తిస్తుంది కేటురెడ్డీ.. కబ్జా కమీషన్, కలెక్షన్ కరప్షన్లకు కేరాఫ్ అడ్రస్ నువ్వు. కమీషన్లు లేక మైండ్ బ్లాక్ అయినట్లు ఉంది. కాస్త ఓపిక పట్టు నీ దారుణాలు గుట్టు విప్పుతా’ అంటూ ఘాటుగా స్పందించారు.
Sorry, no posts matched your criteria.