India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో ఉన్న నడిమి వంకను కలెక్టర్ వినోద్ కుమార్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత.. అధికారులతో కలిసి పరిశీలించారు. వంకకు రెండువైపులా ఉన్న ఆదర్శ నగర్‌తో పాటు సుమారు 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘సత్య.. ధర్మవరం ప్రజలు నిన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన పాపానికి నువ్వు, నీ కూటమి పార్టీ నేతలైన జనసేన, టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. వాటాలు వేసుకుంటూ ప్రజల్ని భయపెట్టి ఇప్పటికే ఎంతో మంది దగ్గర వసూళ్లు చేశారు. నీ వాటాలు నీకూ అందాయి కదా?’ అంటూ కేతిరెడ్డి ట్వీట్ చేశారు.
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలున్నాయి. అవి.. పెన్నహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తికోట, పుట్టపర్తి, ఆలూరుకోన, కసాపురం, జంబు ద్విపా, యోగివేమన సమాధి, కదిరి నరసింహస్వామి, తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రానన్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.
అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మడకశిర మండలం గౌడనహళ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కృష్ణవేణి ప్రతిభ కనబరిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర మంగళవారం తెలిపారు. తన పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కృష్ణవేణి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆమెను వ్యాయామ ఉపాధ్యాయురాలు అరుణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ సత్య సాయి జిల్లాలో ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ 99.32% పూర్తయిందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జాబితాలో సవరణల కోసం 14,08,524 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 13,98,947 పరిశీలించామని, మిగిలిన వాటిని వారంలోగా పరిష్కరిస్తామని ఎన్నికల కమిషన్ దృష్టికి కలెక్టర్ తెచ్చారు. కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఉద్దేశించిన గడువులోగా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పందం ప్రాతిపదికన, బోధ నేతర సిబ్బందిని పొరుగు సేవల ప్రాతిపదికన నిర్వహించుటకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళ అభ్యర్థులు పదవ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
అక్టోబర్ నెల చివరి నాటికి శ్రీ సత్యసాయి జిల్లా లో ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. అమరావతిలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల చివరి నాటికి వెరిఫికేషన్ పూర్తి చేసి నివేదిక ఇస్తామన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరులో క్రిష్టప్ప అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. పొలంలో విద్యుత్ స్టాటర్ పెట్టె వద్ద క్రిష్టప్పకు షాక్ కొట్టి మృతిచెందారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.
యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో NRI వెల్ఫేర్ సొసైటీ వారు అందించే మహాత్మా గాంధీ లీడర్‌షిప్ అవార్డుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఎంపికయ్యారు. విశిష్ఠ అవార్డుకు దేశంలోని నిర్మాణ రంగంలో, సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్న SR కన్‌స్ట్రక్షన్స్ ఛైర్మన్ సురేంద్ర బాబును ఎంపికచేశారు. అవార్డను గాంధీ జయంతి అక్టోబర్ 2న అందుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.