Anantapur

News May 12, 2024

అనంత: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

image

యాడికి మండలం గుడిపాడులో చిన్నపాటి విషయమై వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైసీపీ కార్యకర్తలు గజేంద్ర, ఈశ్వరయ్య గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణలో గాయపడిన గజేంద్రను అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News May 12, 2024

శ్రీ సత్యసాయి: చెత్తకుప్పలో పసికందు మృతదేహం

image

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చంపి శివాపురం వీధిలోని చెత్తకుప్పలో పడేశారు. అక్కడే ఉన్న పందులు, కుక్కలు ఆ శిశువు మృతదేహాన్ని రెండు భాగాలుగా చీల్చాయి. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 12, 2024

అనంత: రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన వర్షం

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండకూడదని తెలిపారు.

News May 12, 2024

13న సాయంత్రం 6 వరకు 144 సెక్షన్: ఎస్పీ

image

13వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు 48 గంటల పాటు 144 సెక్షను అమల్లో ఉంటుందని అనంతపురం ఎస్పీ బర్దర్ తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల కమిషన్ డ్రైడే ప్రకటించడంతో శనివారం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయించామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డయల్ 100 లేదా జిల్లా పోలీసు ఎన్నికల విభాగం 93929 18293కు తెలియజేయాలన్నారు.

News May 12, 2024

అనంత జిల్లాలో 3,940 మంది పోలీసులతో బందోబస్తు

image

అనంత జిల్లాలో జరిగే ఎన్నికలకు 3,940 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన సివిల్ 1,400 మంది, ఏఆర్ 420, హోంగార్డులు 438 విధుల్లో పాల్గొంటారని ఎస్పీ తెలిపారు. సీఆర్పీఎఫ్ 85 మంది, బీఎస్ఎఫ్ A380, నాగాలాండ్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసులు 420 మందితో పాటు కర్ణాటక సివిల్ పోలీసులు 200 మంది, కర్ణాటక హోంగార్డులు 440 మందిని నియమించారు.

News May 12, 2024

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్పీ మాధవ్ రెడ్డి

image

13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

News May 11, 2024

అనంతపురంలోకి 100 మంది బయటి వ్యక్తులు..?

image

ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో అల్లర్లు సృష్టించడానికి వంద మంది బయటి వ్యక్తులు నగరానికి వచ్చినట్లు జనసేన నేత జయరామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అల్లుడు వారిని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన డీఎస్పీ.. తాము నగరంలో సోదాలు జరుపుతామని జయరామిరెడ్డికి హామీ ఇచ్చారు.

News May 11, 2024

శ్రీ సత్యసాయి: బైక్, కారు ఢీకొని వ్యక్తి మృతి

image

ముదిగుబ్బ మండలంలోని జొన్నలకొత్తపల్లి, రాళ్ల అనంతపురం మధ్య చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఉప్పలపాడుకు చెందిన రఫీ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News May 11, 2024

అనంతలో పోలింగ్ నిర్వహణకు 15,776 మంది అధికారులు

image

అనంతలో పోలింగ్ నిర్వహణకు 15,776 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులు (పీఓ) 2,472 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ) 2,552 మందిని నియమించారు. ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓ) 10,208 మందిని వినియోగించనున్నారు. వీరు కాకుండా 544 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 1,032 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు.

News May 11, 2024

ఎన్నికల విధుల్లో పారదర్శకం పనిచేయాలి: అనంత కలెక్టర్

image

అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం ఎన్నికల సెక్టోరియల్, పోలీస్ అధికారులు, అసెంబ్లీ స్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పారదర్శకంగా పని చేయాలని కోరారు. పోలింగ్ సిబ్బంది నిబంధనలకు లోబడి పని చేయాలని అన్నారు.