India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని ఆరామ్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కి జిల్లా టీడీపీ అంజినప్ప పుష్పగుచ్చాన్ని అందజేశారు.

పుట్టపర్తి కలెక్టరేట్‌లో కత్తి కలకలం రేపింది. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తనకల్లు మం. బొంతలపల్లి గ్రామానికి చెందిన ప్రేమలత అనే మహిళ కత్తితో రావడం సంచలనమైంది. పోలీసులు విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహించగా కత్తి బయటపడింది. మహిళను విచారించగా తాను ఒంటరి మహిళనని, ఆత్మరక్షణ కోసం కత్తి తెచ్చుకున్నానని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కత్తి స్వాధీనం చేసుకుని ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు సింధూర రెడ్డి, ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, జనసేన ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఇన్‌ఛార్జ్ మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అనంతపురం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు 5,05,831 మంది అర్హత సాధించారు. వీరికి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లను అందజేస్తుంది. జిల్లాలో 1,61,437 మంది దీపం-2 పథకానికి అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఆధార్, రేషన్ కార్డు ప్రామాణికంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులకు సందేహాలుంటే 1967 నంబరుకు ఫోన్ చేయొచ్చు. ఇప్పటికే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు చెన్నైలో నిర్వహించే హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్ షిప్‌కు ఏపీ తరఫున అనంతపురం జిల్లాకు చెందిన జస్వంత్, చంద్రమౌళి ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురంలో జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.అనిల్ కుమార్ మాట్లాడారు. నేషనల్ చాంపియన్ షిప్‌కు జిల్లా క్రీడాకారులు ఎంపికవ్వడం అభినందనీయం అన్నారు.

హిందూపురంలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. చిలమత్తూరు మండలంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పాత నేరస్థులు హిందూపురానికి చెందిన వారు పోలీసుల విచారణలో పలు అంశాలను వెల్లడించారు. నేరస్థులకు సహకరించిన కానిస్టేబుళ్లు నరేశ్, వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయా మండలాల్లోని పలు ప్రాంతాలను సందర్శించి రైతులతో పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు.

పెనుకొండ నియోజకవర్గంలో త్వరలో మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పెనుకొండ టీడీపీ కార్యాలయంలో 5 మండలాలకు చెందిన పార్టీ నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కార్యకర్తల బాగుకోసం జీవిత బీమాతో కూడిన పార్టీ సభ్యత్వాన్ని చంద్రబాబు ప్రారంభించారన్నారు.

అనంతపురానికి చెందిన దండు చక్రిక నవంబర్ 21 నుంచి కటక్‌లో నిర్వహించనున్న బీసీసీఐ ఉమెన్ అండర్-15 వన్డే టోర్నీకి ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురంలో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ భీమలింగా రెడ్డి మాట్లాడుతూ.. చక్రిక 2024-25 సీజన్‌కు ఆంధ్ర మహిళల అండర్-15 రాష్ట్ర జట్టుకు ఎంపికైందన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల పర్యటనకు వచ్చిన మంత్రి సవితకు సొంత పార్టీ నుంచే నిరసన వ్యక్తమైంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమిపూజ చేయడానికి మంత్రి రొద్దం గ్రామానికి రాగా.. మండలానికి చెందిన MP పార్థసారథికి కనీసం ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదని MP వర్గీయులు నిలదీశారు. దీంతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కొద్ది సేపు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
Sorry, no posts matched your criteria.