Anantapur

News May 9, 2024

తాడిపత్రి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన

image

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్ఓ కార్యాలయం ముందు స్వతంత్ర అభ్యర్థి నాగరాజు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన చెందారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని ఎన్నికలు రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో అర్ధనగ్న ప్రదర్శన విరమించారు.

News May 9, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో సినీ హీరో నారా రోహిత్ పర్యటన

image

శ్రీ సత్యసాయి జిల్లాలో సినీ హీరో నారా రోహిత్ పర్యటించనున్నట్లు మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. రొళ్ల మండల కేంద్రంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ఎంఎస్ రాజు, ఎంపీ అభ్యర్థి పార్థసారథికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.

News May 9, 2024

అనంతపురం డీఐజీగా షేమషి నియామికం

image

అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

News May 8, 2024

అనంతపురం డీఐజీగా షేమషి నియామికం

image

అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

News May 8, 2024

‘ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం దుకాణాలు బంద్’

image

ఈనెల 13న ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా దుకాణాలను మూసి ఉంచాలని పేర్కొన్నారు.

News May 8, 2024

సీఎం జగన్ కళ్యాణదుర్గం రేపు పర్యటన షెడ్యూల్

image

సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కర్నూలులో గురువారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1గంటకు కళ్యాణదుర్గానికి చేరుకుంటారు. 1.10కి హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. 1.30 నుంచి 2.15 వరకు బహిరంగసభ, అనంతరం 2.30కు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వెళ్లనున్నారు.

News May 8, 2024

అనంత జిల్లాలో రానున్న 2 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. వచ్చే 5 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 41.6 నుంచి 43.7 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28.6 నుంచి 29.7 డిగ్రీలుగా నమోదయ్యే సూచన ఉందన్నారు.

News May 8, 2024

ఓట్లకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు: రిటైర్డ్ ఉద్యోగి

image

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఓటు హక్కు ప్రాధాన్యతను వినూత్న రీతిలో వ్యక్తపరిచారు. తన ఇంటి ముందు గోడకు ‘ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు. భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం’ అంటూ జిరాక్స్ పేపర్లు అంటించారు. పట్టణంలోని బుగ్గయ్య కాంపౌండ్ వీధికి చెందిన ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి దూదేకుల షాషావలి ఈ వినూత్న ప్రచారానికి తెరతీశారు.

News May 8, 2024

అనంత: ఒకే నియోజకవర్గం.. 2 జిల్లాలు..!

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు సెగ్మెంట్ 2 జిల్లాల్లో విస్తరించింది. అనంతపురం(పాక్షికం), ఆత్మకూరు, రాప్తాడు అనంత జిల్లాలో, కనగానపల్లి, C.కొత్తపల్లి, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా రాప్తాడు అసెంబ్లీ స్థానం 2009లో ఏర్పడింది. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పరిటాల సునీత గెలుపొందగా.. 2019లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు.

News May 8, 2024

ఈనెల 9 నుంచి ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం ఐటీఐ ప్రిన్సిపల్ రామమూర్తి తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఐటీఐ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు లభించడానికి అధిక అవకాశాలు ఉన్నాయన్నారు.