India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురయ్యారు. అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్‌లో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వెపన్ క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయింది. ఘటనలో ఆయన గాయపడ్డారు. సిబ్బంది వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నవంబర్ ఒకటో తేదీ 99% పింఛన్ల పంపిణీ పూర్తి కావాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. 2,66,137 మందికి రూ.114.27 కోట్ల మొత్తాన్ని 9561 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయమే పంపిణీ ప్రారంభించనున్నామన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పింఛన్ల పంపిణీకి సమయం పొడిగించడం జరగదన్నారు.

అనంతపురంలోని పిల్లిగుంట కాలనీలో గురువారం శ్రీనివాసులు అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

జిల్లాలో వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ప్రజలు లక్ష్మీపూజలు, నోములు, వ్రతాలు చేశారు. ఈ సారి 20 శాతం మేర టపాసుల ధరలు పెరిగినా ఎవరి సామర్థ్యం మేరకు వారు కొనుగోలు చేశారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో ఎటుచూసినా పటాసుల శబ్దాలే వినిపిస్తున్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి వంటి ప్రధాన పట్టణాల్లో టపాసుల మోత మోగుతోంది. మరి మీ ఇంట దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కామెంట్ చేయండి..

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకందరికీ ఆదర్శ దాయకమని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు.

అనంతపురం జిల్లాలో టపాసులను అత్యధికులు పరిమిత స్థాయిలోనే కొనుగోలు చేస్తున్నారు. తారాజువ్వలు, చిచ్చుబుడ్డి, కాకరపువ్వొత్తులు, తాళ్లు, పాము బిళ్లలు, భూచక్రాలు వంటి వాటికి డిమాండ్ ఉంది. భారీ శబ్దాలు వచ్చే వాటిపై ఆసక్తి కనబరచడం లేదు. ఈసారి ధరలు 20% పెరిగాయని అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ, గుత్తి తదితర ప్రాంతాల్లోని వినియోగదారులు చెబుతున్నారు. మరి మీ ఇంట దీపావళి సందడి ఎలా ఉంది. కామెంట్ చేయండి..

మడకశిర MLA ఎంఎస్ రాజుకు టీటీడీ బోర్డ్ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలకు గానూ మరో గుర్తింపు దక్కిందని కొనియాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆయనపై 60 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. లోకేశ్ పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అనంతపురం నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేశారు.

టపాకాయలు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆయన పరిశీలించారు. అక్కడ నిర్వాహకులు తీసుకున్న జాగ్రతలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 101, 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వెంటనే సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రమాదాన్ని నివారిస్తారని స్పష్టం చేశారు.

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో దీపావళి పండుగ సందర్భంగా అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి రైలు (06237) నవంబరు 4న రాత్రి 9.00 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణించి నవంబరు 6వ తేదీ రాత్రి 8 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు బరౌనీలో నవంబరు 9న ఉ.10 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో కేజీబీవీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు మెరిట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు బ్లాక్ స్పాట్‌లో ఉంచినట్లు డీఈవో కిష్టప్ప తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆధారాలతో అందజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.