India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టపాకాయలు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆయన పరిశీలించారు. అక్కడ నిర్వాహకులు తీసుకున్న జాగ్రతలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 101, 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వెంటనే సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రమాదాన్ని నివారిస్తారని స్పష్టం చేశారు.

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో దీపావళి పండుగ సందర్భంగా అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి రైలు (06237) నవంబరు 4న రాత్రి 9.00 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణించి నవంబరు 6వ తేదీ రాత్రి 8 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు బరౌనీలో నవంబరు 9న ఉ.10 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో కేజీబీవీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు మెరిట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు బ్లాక్ స్పాట్‌లో ఉంచినట్లు డీఈవో కిష్టప్ప తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆధారాలతో అందజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.

సమష్టిగా పనిచేసే నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను విచారించి త్వరగా పూర్తి చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. హత్య, పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులపై ఎస్పీ ఆరా తీశారు.

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 2, 3, 4 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R14, R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా మడకశిర నియోజకవర్గం ఎమ్యెల్యే MS రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఈయన ఒక్కరికే బోర్డు సభ్యుడిగా అవకాశం రావడం విశేషం.

బెలుగుప్ప మండలం జీడిపల్లికి చెందిన నవ్య(22) ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నవ్య డిగ్రీ చదవడంతో పాటు సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసింది. పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. కానీ ఉద్యోగం దొరకలేదు.ఇక ఉద్యోగం రాదనే బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 15వ తేదీలోగా జయంతి వేడుకలకు సంబంధించి అన్ని పనులు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికతో పనులు చేపట్టాలన్నారు.

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గిందని డ్యామ్ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 13,893 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోందన్నారు. ప్రస్తుతం 101.773 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. 15,054 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి షేక్ మహమ్మద్ వలికి సైబర్ నేరగాళ్లు రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని మహమ్మద్ వలికి కాల్ చేశారు. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని బెదిరించారు. వెంటనే అరెస్టు చేయకూడదంటే మీ వద్ద ఉన్న డబ్బంతా తమ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు. దీంతో బాధితుడు భయపడి డబ్బు బదిలీ చేశాడు.
Sorry, no posts matched your criteria.