India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం రూరల్ స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.28తో అమ్ముడు పోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 975 టన్నుల దిగుబడులు వచ్చాయని ఆయన అన్నారు. కిలో సరాసరి ధర రూ.20, కనిష్ఠ ధర రూ.13 పలికినట్లు తెలిపారు. మార్కెట్లో టమాటా ధరలు క్రమేణా తగ్గుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయని చెప్పారు. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 33-34.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చని తెలిపారు. ఇక గాలులు గంటకు 2 కి.మీ వేగంతో వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా 2025 ఓటర్లు జాబితాను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 20,20,441 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 9,98,784 మంది, మహిళా ఓటర్లు 10,21,412 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 245 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జాబితా విడుదల చేసినట్లు తెలిపారు.

దీపావళి పండుగ సందర్భంలో టపాసులు విక్రయించేవారు నిబంధనలను తప్పక పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. టపాసులు పేల్చే సమయంలో తల్లితండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగ జరుపుకునే సమయంలో ఎంత కాంతి, ఆనందాన్ని ఇస్తుందో అవి వికటిస్తే కుటుంబాల్లో అంతే విషాదం తెచ్చిపెడతాయన్నారు. అందుకోసమే టపాసులు విక్రయించే వారితో పాటు పేల్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఖరీఫ్ సీజన్‌లో కరవు మండలాలు..
➤నార్పల➤అనంతపురం
➤ తాడిమర్రి ➤ముదిగుబ్బ ➤తలుపుల➤
☞ విడపనకల్లు ☞ యాడికి ☞ గార్లదిన్నె
☞ బీకేసముద్రం ☞ రాప్తాడు
☞ కనగానిపల్లె
☞ ధర్మవరం ☞ నంబులపూలకుంట
☞ గాండ్లపెంట ☞ బుక్కపట్నం ☞ రామగిరి
☞ పరిగి
➤ (తీవ్రమైన కరవు) ☞ (మధ్యస్త కరవు) అని ప్రభుత్వం ప్రకటించింది.

పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా పోలీసులు దేశంలో అగ్రస్థానంలో నిలిచారని జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటి వరకు 10 వేల మొబైల్ ఫోన్లు రికవరి చేసినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.18.85 కోట్లు ఉంటుందని వెల్లడించారు. మంగళవారం 1,309 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు. మొబైల్స్ అందుకున్న బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మంగళవారం DYNAMECHS-2K24 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగం వైపు మాత్రమే కాకుండా.. పరిశోధనల వైపు కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

విద్యార్థులు చేసే పరిశోధన ఫలితాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం నందు స్వర్ణాంధ్ర-2047 విజన్ కార్యక్రమాలు అమలుపై విద్యార్థుల పాత్ర గురించి కలెక్టర్ మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ ను తయారు చేయడంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్థిరమైన అభివృద్ధిని సృష్టించే దృక్పథం అన్నారు.

అనంతపురానికి చెందిన హరి(21) మంగళవారం ఉదయం అన్నమయ్య జిల్లాలో మృతిచెందాడు. కురబలకోట మండలం అంగళ్లుకు స్నేహితురాలిని కలవడానికి వెళ్లాడు. బస్టాండు వద్ద నిలబడి మాట్లాడుతుండగా ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చాయి. కిందపడి గాయపడడంతో వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మార్గమధ్యలోనే హరి మృతిచెందినట్లు నిర్ధారించారు.

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, నగర మేయర్ వసీం, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ ఏ.మలోల, జడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.