India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఏపీ(సీడాప్) నిర్ణయం తీసుకుంది. ఈ స్కూల్‌లో విదేశాల్లో డ్రైవింగ్ అవకాశాలు పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీడాప్ ఛైర్మన్ దీపక్‌రెడ్డి ప్రకటించారు.

అనంతపురం జిల్లాలో క్రమంగా టమాటా ధరలు పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ పంటను రైతులు విస్తారంగా సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు కలవర పెడుతున్నాయి. కక్కలపల్లి మండీలో కిలో టమాటా గరిష్ఠ ధర రూ.26 పలుకుతుండగా కనిష్ఠ రూ.13, సరాసరి రూ.20 ప్రకారం క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేయనుండగా నేటి నుంచి బుకింగ్ ప్రక్రియ మొదలుకానుంది. తెల్లరేషన్ కార్డుదారులు ఈ పథకానికి అర్హులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 12,08,293 కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.

ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ నవంబర్ 1న ఉదయం 6 గంటలకే మొదలు కావాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,85,004 పెన్షన్లు ఉండగా, అందుకు సంబంధించి రూ.120,09,75,000 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకులలో నగదు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈనెల 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి ఉచిత గ్యాస్ కు బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన ద్వారా సోమవారం తెలిపారు. ఈ పథకం 31వ తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జిల్లాలో 5,36,289 గ్యాస్ కనెక్షన్ దార్లకు సబ్సిడీ అందనుందని, రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అర్హులని పేర్కొన్నారు. బుక్ చేసుకున్న తర్వాత డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో డబ్బు వారి ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు.

ర్యాగింగ్ భూతానికి మెడికల్ విద్యార్థులు దూరంగా ఉండాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ మాణిక్య రావు అధ్యక్షతన ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జగదీశ్, న్యాయసేవ సాధన కార్యదర్శి శివ ప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కళాశాలలో జూనియర్, సీనియర్ భేదం లేకుండా సోదర భావంతో ఉండాలని సూచించారు.

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్(47) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. రామ్మోహన్ బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డిలోని జడ్పీ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తూ, కళ్యాణదుర్గంలో నివాసముంటున్నారు. స్నానానికి వెళ్లే సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామ్మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఉరవకొండ: అమరావతిలోని సచివాలయంలోఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల పాల్గొని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు గురించి చర్చించారు. సమావేశంలో ఇతర శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 45 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, ఆస్తి వివాదాలు, తదితర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

ప్రజలకు భద్రత కల్పించడం, రక్షించడంతో పాటు ప్రాణాలను నిలబెట్టడం తమ కర్తవ్యమని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.