India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరు నుంచి ధర్మవరం వరకు నడుస్తున్న 06515/06516 ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి బీఎస్ క్రిస్టోఫర్ ఆదేశాలు జారీచేశారు. సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వినతి మేరకు పొడిగించినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాను దేశంలో ప్రథమ స్థానంలో ఉండటానికి కావలిసిన అని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీఎంఐపీ పథకం పైన సమీక్షసమావేశం నిర్వహించార. రాష్ట్ర స్థాయి డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ తదితరులతో నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో రైతు మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తాడిపత్రి మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో రైతు అమరేశ్ రెండెకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే పెట్టిన పెట్టుబడులు సరిగా రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురానికి టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకున్న ఆయనకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. ఆయన నేరుగా పట్టణంలోని మాసినేని గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు బారులు తీరారు.
తాడిపత్రికి చెందిన 40 మంది యాత్రికులు బద్రీనాథ్‌లో చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం గోచార రుద్ర ప్రయాగ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ రహదారిని మూసివేశారు. దీంతో నిన్నటి నుంచి రోడ్డుపైనే ఉంటున్న యాత్రికులు ఆహారం, నీళ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని వారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు.
కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుశ్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. రైలులో పుత్తూరుకు వెళ్తూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
➤ అనంతపురం పాతూరు మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా మేలు రకం రూ.35తో అమ్మకాలు జరిగాయి. కనిష్ఠంగా కిలో రూ.20 పలికాయి.
➤ నగరంలోని మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.18వేల ప్రకారం విక్రయాలు జరిగాయి.
అనంతపురం ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో రౌండ్ మ్యాచ్‌లకు త్వరలోనే టికెట్లు పంపిణీ చేస్తామని అనంతపురం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు, కళాశాలలు, ఆర్డీటీ సబ్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులకు మ్యాచ్ పాసులను లెటర్ ప్యాడ్ ఆధారంగా అందజేస్తామని తెలిపారు. 9866157250 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
తాడిపత్రిలోని గాంధీనగర్‌లో సోమవారం చోరీ జరిగింది. నాగరాజు ఇంట్లో లేని సమయంలో దాదాపు 10 తులాల బంగారాన్ని దూసుకెళ్లినట్లు పట్టణ పోలీసులకు భాదితులు నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో రోడ్లో నివాసం ఉండే అనిత అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.