Anantapur

News May 1, 2024

ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు: సత్యసాయి కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పోలీస్ అబ్జర్వర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నియమించిన పోలీస్ అబ్జర్వర్‌కు చెందిన 9502846080 ఫోన్ నంబర్‌కు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.

News April 30, 2024

అనంత: ఈతకు వెళ్లి ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి

image

కంబదూరులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కంబదూరుకి చెందిన సూర్య, అరుణ దంపతుల ఏకైక కుమార్తె ప్రణీత(14) ఈతకు వెళ్లి మృతి చెందింది. ప్రణీత తన బంధువులతో కలిసి గ్రామ శివారులోని తోటలో ఉన్న ఫామ్ పాండ్‌లో ఈత కొడుతూ ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 30, 2024

అనంతపురం రూరల్ వైసీపీ ఎంపీటీసీ నగేశ్‌పై హత్యాయత్నం

image

ఎన్నికల నేపథ్యంలో అనంతపురం రూరల్ ఎంపీటీసీ నగేశ్‌పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News April 30, 2024

SKU: మెగా సప్లిమెంటరీ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్

image

శ్రీ కృష్ణదేవరాయ విద్యాలయ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ తదితర యూజీ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు త్వరలో మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేస్తామని వీసీ హుస్సేన్ రెడ్డి తెలిపారు.1994-95 నుంచి 2014-15, సెమిస్టర్ విధానంలో 2015-2019 మధ్య పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్కేయూ పరీక్షల విభాగం తెలిపింది.

News April 30, 2024

నేటి నుంచి హుబ్లీ-గుంతకల్ ప్యాసింజర్ రైలు పాక్షికంగా రద్దు

image

గుంతకల్ రైల్వే డివిజన్‌లోని హుబ్లీ-గుంతకల్ ప్రధాన రైలు మార్గంలో జరుగుతున్న పనుల కారణంగా ఈ మార్గంలో తిరిగే ప్యాసింజర్ రైలు సర్వీసులను మంగళవారం నుంచి పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు హుబ్లీ-తోర్నకల్ మధ్య మాత్రమే ప్యాసింజర్ రైలు తిరుగుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News April 30, 2024

పొక్సో కేసులో నిందితునికి జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు షేక్ బాషకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.3000 జరిమాన విధిస్తూ అనంతపురం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించారు. 2020లో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో సాక్ష్యాలు రుజువు కావడంతో శిక్ష విధించింది. శిక్ష పడే విధంగా చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News April 30, 2024

అనంతలో భగభగమంటున్న భానుడు

image

జిల్లా వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. గుంతకల్లులో సోమవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, తలుపులలో 44.1, బొమ్మనహాళ్ 43.9, యల్లనూరు, తాడిపత్రి, అనంతపురంలో 43.7, పెద్దవడుగూరు 43.2, కూడేరు, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువులో 43.0, విడపనకల్లు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 

News April 30, 2024

అనంతపురం జిల్లాలో మొత్తం 20,18,162 మంది ఓటర్లు

image

అనంతపురం జిల్లాలో మొత్తం 20,18,162 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మే 13న జరిగే పోలింగ్‌లో వారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటీవల 16,962 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. దీంతో జిల్లాలో మొత్తం ఓటర్లు ఓటర్ల సంఖ్య 20,18,162 మంది ఉండగా అందులో పురుషులు 9,97,792 మంది, స్త్రీలు 10,20,124, ఇతరులు 246 మంది ఉన్నారు.

News April 30, 2024

అనంత జిల్లాలో ఈ రెండు చోట్లా రెండేసి ఈవీఎంలు

image

అనంత ఎంపీ, తాడిపత్రి అసెంబ్లీ పరిధిలో రెండేసి ఈవీఎంలు ఉంటాయి. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 16 మంది పేర్లు, గుర్తులు కేటాయించేందుకు అవకాశం ఉండగా.. అనంత ఎంపీ బరిలో 21, తాడిపత్రిలో 18 మంది ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్‌లో లోక్ సభ ఈవీఎంలు 2, అసెంబ్లీకి 1 ఉంటాయి. తాడిపత్రి పరిధిలో లోక్ సభకు సంబంధించి 2, అసెంబ్లీకి మరో 2 ఇలా ఒక్క తాడిపత్రి పరిధిలో ప్రతి పోలింగు కేంద్రంలో 4 ఉంటాయి.

News April 30, 2024

తాడిపత్రిలో 18, ఉరవకొండలో 11 మంది పోటీ

image

అనంత జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు 113 మంది పోటీలో ఉన్నారు. ఉరవకొండ మినహా మిగతా 7 చోట్లా 23 మంది నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. అత్యధికంగా తాడిపత్రి 18, తక్కువగా ఉరవకొండలో 11 మంది పోటీలో ఉన్నారు. అనంత అర్బన్, కళ్యాణదుర్గంలో 15, శింగనమల, గుంతకల్లులో 14, రాయదుర్గం, రాప్తాడులో 13 చొప్పున పోటీలో నిలిచారు. ఇక అనంత ఎంపీకి 21మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఒక్కరు కూడా ఉపసంహరించుకోలేదు.