India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ పంపిణీ చేస్తారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేస్తారు. అర్హులను తెల్లరేషన్ కార్డుల ప్రాతిపదికన నిర్ణయిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12,08,293 కుటుంబాలు లబ్ధిపొందుతాయి. మొత్తంగా జిల్లాలో 12,54,911 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ పంపిణీ చేస్తారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేస్తారు. అర్హులను తెల్లరేషన్ కార్డుల ప్రాతిపదికన నిర్ణయిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12,08,293 కుటుంబాలు లబ్ధిపొందుతాయి. మొత్తంగా జిల్లాలో 12,54,911 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

అనంతపురం జిల్లా యాడికిలో నిన్న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆస్తి తగాదా విషయపై కన్న కొడుకే తండ్రిని హత మార్చినట్లు సీఐ ఈరన్న తెలిపారు. మండలంలోని ఈరన్నపల్లికి చెందిన మృతుడు లక్ష్మీనారాయణతో మొదటి భార్య కొడుకు కార్తీక్ గొడవ పెట్టుకుని కత్తితో పొడిచి, రాళ్లతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. రెండవ భార్య రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

రెండ్రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రెండు రోజులు మళ్లీ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాల వద్దకు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. హగరి, చిత్రావతి, పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందన్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్‌హెచ్ 342, ఎన్‌హెచ్ 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు-కడప-విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. విజయవాడలోని చేనేత శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చేనేతల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుకు చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని, నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు.

యల్లనూరు మండలంలోని వెన్నపూసపల్లికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకునిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యబాబు, ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఈనెల 25న మడకశిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ తెలిపారు. 8 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగ మేళాకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన విద్యార్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో మేళాకు హాజరు కావాలని కోరారు.

చిలమత్తూరు సమీపంలో జరిగిన అత్యాచార ఘటనలో పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులను అరెస్టు చేశామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఈ ఘటనలో రెండో నిందితుడిగా ఉన్న చాకలి శ్రీనివాసులను మంగళవారం మధ్యాహ్నం పూలకుంట గ్రామ శివారులో అదుపులోకి తీసుకుమన్నారు. చాకలి శ్రీనివాసులు ఇప్పటికే దోపిడీ, అక్రమ మద్యం రవాణా, రేపు కేసులలో నిందితుడుగా ఉన్నాడన్నారు.

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.