India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం వైపు నుంచి కదిరి వైపునకు బైక్‌పై వెళ్తుండగా పక్కనున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అనంత: ఖరీఫ్లో చేపడుతున్న ఈ పంట నమోదులో వ్యవసాయ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంతో వ్యవహరించి రాదనీ, ఈ నెల 15 నాటికీ వంద శాతం పంట నమోదు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్దేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పంట నమోదులో భాగంగా బ్రహ్మసముద్రం, నార్పల, హీరేహాళ్ మండలాలు వెనుకబడ్డాయని, కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వజ్రకరూరులో మాత్రమే 100 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.
లేపాక్షి మండలం బిసలమానేపల్లిలో మధుసూదన్ తన ఇంటి వద్ద నిలిపిన బుల్లెట్ వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో బైక్ పూర్తిగా కాలిపోయి దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కంబదూరు మండలంలోని అండేపల్లి శివార్లలో ఉన్న దేవరమాన్ల వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంసాలి బాలాజీ(24) అనే యువకుడు మృతిచెందాడు. మృతిడు కదిరిదేవరపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు.
మడకశిరలోని యాదవ కళ్యాణ్ మండపంలో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు. అమర్ రాజా కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ చేసినవారు అర్హులన్నారు. శిక్షణ సమయంలో రూ.11,875 నుంచి రూ.12,642 స్టైఫండ్ ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో శుక్రవారం వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని అన్ని మద్యం దుకాణాలకు అధికారులు సీలు వేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా హిందూపురం మున్సిపాలిటీలో ఉన్న అన్ని మద్యం షాపులు, బార్లు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ముందస్తుగా మూసివేశారు.
అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటామని, ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. ఏది ఏమైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలిపారు.
తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు కోనలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఎండోమెంట్ అధికారులు నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి వన్నూరు స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు వచ్చిన హుండీని ఆలయ అర్చకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో లెక్కించారు. రూ.27,24,184ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఉరవకొండ పేరు వినగానే కొండ గుర్తుకొస్తుంది. పట్టణంలోని ఈ కొండకు ఘన చరిత్రే ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం ఈ పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలేగాడు ఇక్కడ కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.