India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కల్యాణదుర్గం పట్టణ శివారులోని కంబదూరు రోడ్డులో రామన్న తోటలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో కొబ్బరి చెట్టు దెబ్బతినింది. పిడుగు శబ్దానికి స్థానిక రైతులు పరుగులు తీశారు. భారీ వర్షానికి తోడు పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు దెబ్బతినింది. రెండు రోజుల క్రితం సెట్టూరు మండల పరిధిలో కూడా పిడుగు పడి ఓ కొబ్బరి చెట్టు పూర్తిగా దెబ్బతినింది.

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని మైనర్, మీడియం ఇరిగేషన్ సంఘాలకు త్వరలో ఎన్నికల నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 214 మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ 16 సంఘాలు ఉన్నాయని, నవంబర్ 21 నుంచి 23 లోపు ఎన్నికలను నిర్వహించనున్నామని తెలిపారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి పుట్టపర్తి, అనంతపురం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెట్లు, టవర్లు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది.

ఏపీ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, వైఎస్సార్ క్యాబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఇంటికే పరిమితం కాగా ఆయనపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘జూటూరు రాజు’ టైటిల్‌తో ఓ డైరెక్టర్ జేసీ ఫ్యామిలీతో చర్చలు జరుపుతున్నారట. నటుడు రాజేంద్రప్రసాద్ దివాకర్ రెడ్డి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

2022 మార్చి 26న భాకరాపేట వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా కలెక్టర్ ఆర్థిక సహాయం అందజేశారు. అప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో పది మంది మృతి చెందగా 41 మంది క్షతగాత్రులు అయ్యారు. కలెక్టర్ చొరవతో ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు వారి వ్యక్తిగత ఖాతాలలో జమ చేయించారు.

అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, అసలు ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 74 మంది చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

జాతీయ స్థాయి రైఫిల్ షూట్ పోటీలకు అనంతపురం విద్యార్థి తీక్షణ్ సాయి ఎంపికయ్యారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన రాష్ట్రస్థాయి రైఫిల్ షూట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తీక్షణ్ సాయి 9వ తరగతి చదువుతున్నట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు.

ప్రభుత్వ పథకాలలో సంతృప్తతను సాధించడంపై దృష్టి సారించి పంచాయతీల మధ్య పోటీని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. 2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ప్రత్యేక అతిథిగా సర్పంచ్‌ల ఆహ్వానం కోసం పంచాయతీల మధ్య పది ప్రధాన పథకాలపై పోటీ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

గార్లదిన్నె మండలం కణంపల్లి గ్రామ సమీపంలోని గుట్టలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గార్లదిన్నె ఎస్ఐ మహమ్మద్ గౌస్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తుఫాను ప్రభావంతో శ్రీ సత్యసాయి జిల్లాలోని 32 మండలాల్లో సాగుచేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ చేతన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం పుట్టపర్తిలో కలెక్టర్‌ను రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వేమ నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య కలిశారు. జిల్లాలో రైతులు సాగుచేసిన వివిధ పంటలు, నష్టాలను రైతుల సాధక బాధకాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
Sorry, no posts matched your criteria.