India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలో ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఉరేగింపు ప్రారంభం కావాలని తెలిపారు. 10 అడుగుల కంటే ఎత్తయిన విగ్రహాలను పంపనూరు కెనాల్లో, 10 అడుగులకు తక్కువ విగ్రహాలను రాచన పల్లి వంకల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో దారుణం ఘటన జరిగింది. ఓ గ్రామంలో దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాని డీఎస్పీ శ్రీలత తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించామన్నారు. దీంతో నిందితుడు భయపడి నేడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అతడు గతంలో వాలంటీర్‌గా పని చేసి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో వినాయకుడి లడ్డూ భారీ స్థాయిలో ధర పలికింది. బంగ్లా బాయ్స్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. విష్ణువర్ధన్ 2 లడ్లు రూ.2.62 లక్షలు, రాజా రూ.85 వేలు, విశ్వనాథ్ చౌదరి రూ.60 వేలు.. మొత్త రూ. 4.17 లక్షలు ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నల్లమాడలోని పాత బాలాజీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వంశీ, ప్రశాంత్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ పోలె వెంకటరెడ్డి తెలిపారు. స్కూల్ గేమ్స్‌లో భాగంగా ఆదివారం కదిరిలో జరిగిన 44వ జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.
ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన ఏ.వినయ్ కుమార్‌కు చోటు దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకూ బెంగళూరు వేదికగా జరిగే టోర్నీలో ప్రాతినిథ్యం వహించనున్నాడు. వినయ్ కుమార్ రెండేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్, విజయ్ హజారే ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది.
ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. విద్యార్హతకు అనుగుణంగా వేతనాలు ఉంటాయని తెలిపారు.
విడపనకల్ మండలం కొట్టాలపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలానికి చెందిన ఎలక్ట్రీషియన్ చంద్ర అనే వ్యక్తి కొట్టాలపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై నిలబడిన లారీని బైక్‌పై వెళ్తూ ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గుత్తి జీఆర్‌పీ పరిధిలోని జక్కల చెరువు-రాయల చెరువు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 14వ తేదీ కోర్టులలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుందని, కక్షిదారులు త్వరితగతిన కేసులు పరిష్కారం కొరకు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, ఎస్సై, కోర్టు కానిస్టేబుల్స్‌తో ఎస్పీ జామ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని భారత మాజీ క్రికెటర్లు దర్శించుకున్నారు. ఆదివారం భారత మాజీ క్రికెటర్లు చేతన్ శర్మ, అజయ్ మల్హోత్రా, ప్రస్తుత బీసీసీఐ మేనేజర్ అమిత్ సిద్దేశ్వర్, మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ షాబుద్దీన్, తదితరులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌కు విచ్చేసిన క్రీడాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
Sorry, no posts matched your criteria.