India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెళుగుప్ప మండలంలోని దుద్దెకుంటలో ఆలయం నిర్మాణం కోసం తీసిన తవ్వకాలలో గ్రామానికి చెందిన క్రాంతి అనే యువకుడికి అయ్పప్ప స్వామి విగ్రహం దొరికింది. క్రాంతి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి తనకు కలలో ఈ విగ్రహం గురించి చెప్పినట్టు తెలిపారన్నాడు. విగ్రహం 500 గ్రాముల బరువు ఉన్నట్లు చెప్పాడు. స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు.
ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద హత్యకు గురైన గుమ్మగట్ట మండలం సిరిగే దొడ్డి గ్రామానికి చెందిన మహిళ శిరీషగా పోలీసులు గుర్తించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోందని, శనివారం ఇంట్లో చెప్పి వచ్చినట్లు శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.
గుంతకల్లు పట్టణంలోని ఆంటోనీ స్ట్రీట్‌లో సోషల్ మీడియా వినాయకుడు కొలువుదీరాడు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్నందున అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల చిహ్నాలతో వినాయకుడిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ , ఇన్స్టాగ్రామ్, ట్విటర్, లింక్డ్ ఇన్, యూట్యూబ్, తదితర సోషల్ మీడియా గుర్తులతో కలిపి రూపొందించామన్నారు.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో హత్య కలకలం రేపింది. వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో సుమారు 22 ఏళ్ల వయసున్న యువతి తలపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు మృతదేహాన్ని గుర్తించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
హౌరా నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (22831/32)ను యశ్వంతపూర్ వరకు పొడిగించారు. ఇది హౌరా నుంచి ధర్మవరం వరకు యథావిధిగా నడుస్తుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి రాత్రి 9:30 గంటలకు చేరుకుని హిందూపురం, యలహంక(స్టాపులు) మీదుగా యశ్వంత్‌పూర్‌కి రాత్రి 12:15కు చేరుకుంటుంది. తిరిగి యశ్వంత్‌పూర్‌లో ఉదయం 5కు బయలుదేరి ప్రశాంతి నిలయానికి ఉదయం7:53కి చేరుకుంటుంది.
శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంహెచ్.ఇనాయతుల్లాను నియమిస్తూ ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆయనను హిందూపురంలోని తన నివాసంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇనాయతుల్లా మాట్లాడుతూ.. తనకు ఈ గుర్తింపు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
దులీప్ ట్రోఫీ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో D టీమ్‌పై C టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ సాగింది ఇలా..
☞ D టీమ్ తొలి ఇన్నింగ్స్ 164/10
☞ C టీమ్ తొలి ఇన్నింగ్స్ 168/10
☞ D టీమ్ 2వ ఇన్నింగ్స్ 236/10
☞ C టీమ్ రెండో ఇన్నింగ్స్ 61 ఓవర్లలో 233/6
☞ ఫలితం: C టీమ్ 4 వికెట్ల తేడాతో విజయం
☞ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మానవ్ సుతార్ (7 వికెట్లు)
YSRCP ఆర్టీఐ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డిని నియమించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పదవి అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. కల్పలతా రెడ్డి తలుపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన వారు.
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వికసిత్ ఆంధ్ర 2047కు సంబంధించి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని ప్రాథమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు, సంవత్సర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ విజయకుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూరుకు చెందిన రాజప్ప(32) ఈనెల 4న అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని పొలాల్లో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబీ రసూల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజప్ప ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర ఏదైనా కారణం వల్ల మృతి చెందాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.