India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుట్టపర్తి పట్టణ విద్యుత్ శాఖ అధికారులపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పుట్టపర్తిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్ స్తంభానికి తీగలు వేలాడుతూ వ్యక్తి ప్రమాదానికి గురి కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో కనీస జాగ్రత్తలు పాటించరా అంటూ ఫైర్ అయ్యారు.

అల్పపీడన ప్రభావంతో అనంతపురం జిల్లాలో వర్షం పడుతోంది. నిన్నటి నుంచి కదిరి, రోళ్ల, ధర్మవరం, బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో <<14360726>>కంట్రోల్ రూమ్స్<<>> ఏర్పాటు చేశారు.

15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. వయోజన విద్య అభివృద్ధిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి గూగుల్ మీట్ విధానం ద్వారా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. అల్పపీడన పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్ష సూచనతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు APSDMA అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించింది. అనంతపురం జిల్లాకు టీజీ భరత్, శ్రీ సత్యసాయి జిల్లాకు అనగాని సత్యప్రసాద్ ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.

➤ ధర్మవరం నియోజకవర్గంలో 5 షాపులు దక్కించుకున్న సందిరెడ్డి శ్రీనివాసులు
➤ మడకశిర నియోజకవర్గంలో 4 దుకాణాల విజేతలుగా వెంకటసుబ్బారెడ్డి, వైజయంతిమాల దంపతులు
➤ తాడిపత్రిలో 6 షాపులు దక్కించుకున్న కాకర్ల రంగనాథ్ కుటుంబసభ్యులు
➤ ఆత్మకూరు మండలంలోని రమేశ్, శ్రీదేవి దంపతులకు 4దుకాణాలు
➤ 4 షాపుల విజేతగా సన్నపురెడ్డి సుజల
☛ అనంత జిల్లాలో 18 షాపులు మహిళలు, 118 పురుషులకు
☛ సత్యసాయి జిల్లాలో 5 మహిళలు, 82 పురుషులకు

అనంతపురం జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఈ నెల16, 17న అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్‌లకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫోన్ చేయాలని అన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ డా.వినోద్ కుమార్ పర్యటించారు. నగరంలోని రజాక్ నగర్, సోమనాథ్ నగర్, ఐదు, ఆరో రోడ్లలో, యువజన కాలనీ, నారాయణ కళాశాల, త్రివేణి టాకీస్, అశోక్ నగర్ బ్రిడ్జి, ఎంజీ కాలనీ, ఖాగానగర్, హౌసింగ్ బోర్డుల్లో ఉన్న నడిమివంక, మరువవంకలో పూడికతీత పనులను పర్యవేక్షించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అల్పపీడన ప్రభావంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు శ్రీ సత్యసాయి జిల్లా, బుధ, గురువారాల్లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసు, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.