India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలో దులీఫ్ ట్రోఫీ మ్యాచ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ్టి మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా తలివచ్చారు. స్టేడియం ఫుల్ అయింది. ఎండతాకిడి లేకుండా తడికెలు ఏర్పాటు చేశారు. బౌండరీ వెళ్లినప్పుడల్లా ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తించారు. కరవు సీమ ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుండటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలతో అనంతపురం స్టేడియం సుందరంగా కనిపిస్తోంది.
courtesy: sakshi
అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో డీ టీమ్ ప్లేయర్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. 48/6తో జట్టు కష్టాల్లో ఉండగా అక్షర్ 78 బంతుల్లో 53* పరుగులతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఐదుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే అవుటై నిరాశపరిచారు. డీ టీమ్ బౌలర్లలో విజయ్ కుమార్, హిమాన్షు, కాంబోజ్ చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రికెట్ అభిమానులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ ప్రపంచంలో గురువే సమస్తం. ఏ రంగంలో రాణించిన వారైనా, సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారైనా ఒక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్న వారే. గురువు అందించిన విజ్ఞానం, ప్రోత్సాహం, స్ఫూర్తితో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారే. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించేది గురువులే. మరి మీ జీవితంలో మీ ఎదుగుదలకు తోడ్పడిన, మీకు ఎంతగానో నచ్చిన గురువు ఎవరు? కామెంట్ చేయండి..
#HappyTeachersDay
అనంతపురంలో కాసేపట్లో దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. C, D జట్లు తలపడనున్నాయి. అయితే స్టేడియంలోకి లాప్‌టాప్‌లు, కెమెరాలు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, బ్యానర్లు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్స్, షార్ప్ మెటల్స్ తదితర వస్తువులను అనుమతించమని, వాటిని వెంట తీసుకురావొద్దని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల కోసం సీ, డీ, ఈ, ఎఫ్ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీరు గేట్-1 నుంచి లోపలికి ప్రవేశించాలి.
గత నెల 20న రాత్రి నల్లమాడ పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్ చోరీ చేసిన దొంగను బుధవారం ఇన్‌ఛార్జ్ ఎస్ఐ వెంకటరమణ స్థానిక వైఎస్సార్ సర్కిల్లో అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ వై.నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు సాయికుమార్ నుంచి కంప్యూటర్ రికవరీ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా వాసులు తీసిన ‘సేద్యం‘ మూవీ పోస్టర్‌ను కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలపై కళ్ళకు కట్టినట్లుగా ఈ సేద్యం మూవీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సేద్యం మూవీ డైరెక్టర్ చంద్రకాంత్, తరిమెల శేషు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నార్పల మండలం దుర్గం గ్రామానికి చెందిన సాకే సంతోశ్ జాతీయ స్థాయి అర్చరీ చాంపియన్‌షిప్ పోటీకు ఎంపికయ్యాడు. తండ్రి మారెన్న సిద్దరాచెర్ల గ్రామ నౌకరుగా, తల్లి సరస్వతి నార్పల ఎంఆర్‌సీలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. సంతోశ్ అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 26న ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉపాధ్యాయులు తెలిపారు.
అనంతపురంలో సదుపాయాలు బాగున్నాయని కెప్టెన్లు రుతురాజ్, అయ్యర్ కొనియాడారు. ‘దేశంలోని అత్యుత్తమ గ్రౌండ్లలో అనంతపురం ఒకటి. అనంతపురం ఆతిథ్యం బాగుంది. పోటీలు ఇక్కడ నిర్వహించడం వల్ల ఇక్కడి క్రికెటర్లకు ఎదగాలన్న ఆసక్తి రేకెత్తుతుంది’ అని తెలిపారు. ఈ క్రమంలో విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు.. ఇక్కడికి వచ్చింది పోటీల్లో ప్రతిభను నిరూపించుకోవడానికే గానీ రుచికరమైన వంటలు తినడానికి కాదని చమత్కరించారు.
రాష్ట్ర మంత్రి సవిత కుమారుడు జగదీశ్ సాయిని సీఎం చంద్రబాబు బుధవారం అభినందించారు. విజయవాడలో వరద బాధితుల కోసం జగదీశ్ తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.21 వేలను విరాళంగా అందజేశారు. నిన్న రాత్రి చంద్రబాబుని కలిసి ఆ మొత్తం అందజేయగా సీఎం మంత్రి కుమారుడిని అభినందించారు.
డిసెంబర్ 8వ తేదీ జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. ఈనెల 6వ తేదీ ముగియాల్సిన గడువును 17వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపల్, ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.