India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలో రేపు జరగనున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ తిలకించి అభిమానులకు కమిటీ సభ్యులు పలు సూచనలు సలహాలు చేశారు. స్టేడియంలోకి లాప్‌టాప్స్, కెమెరాలు, అగ్గి పెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్లు, సిగరెట్టు, లైటర్లు, హెల్మెట్లు, నీళ్ల బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, షార్ప్ మెటల్స్, తదితర వస్తువులను అనుమతి లేదని స్పష్టం చేశారు.
కేంచమ్మనహళ్లి గేట్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కంబదూరు మండలం తిమ్మాపురానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ ఈరన్న, అతని తమ్ముడు చిక్కీరప్ప తీవ్రంగా గాయపడ్డారు. అయితే పావగడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరన్న మృతిచెందారు. ఈ ఘటనతో తిమ్మాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా రెవిన్యూ అధికారి రామకృష్ణ రెడ్డి సత్యసాయి కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలం అయినట్లు కార్మిక సంఘం నాయకులు ఉపేంద్ర కుమార్ తెలిపారు. కార్మికులకు ఎలాంటి తక్షణ సహాయం లేకుండా సమ్మె విరమించాలని అడిగారన్నారు. అందుకు కార్మిక సంఘాలు అంగీకరించలేదని చెప్పారు. సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు.
సత్యసాయి జిల్లాలో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న గురు పూజోత్సవ వేడుకల్లో అవార్డుకు ఎంపికైన వారికి అందించనున్నట్లు వెల్లడించారు. అవార్డులకు ఎంపికైన వారందరికీ కార్యాలయం నుంచి సమాచారం పంపినట్లు తెలిపారు.
అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానం సామర్థ్యాన్ని బట్టి మ్యాచ్‌లు తిలకించేందుకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేసినట్లు దులీప్ ట్రోఫీ సెక్రటరీ షాబుద్దీన్ తెలిపారు. స్టేడియంలోని సీ-గ్యాలరీలో 700, డీ-గ్యాలరీ 400, ఈ-గ్యాలరీ 1100, ఎఫ్-గ్యాలరీలో 720 మంది ప్రేక్షకులు కూర్చునే విధంగా ఆర్డీటీ అధికారులు ఎంట్రీ పాసులను జారీ చేసినట్లు చెప్పారు. పాసులు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా అనంత వెంకటరామిరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పైలా నర్సింహయ్య వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అనంతపురం అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అనంత వెంకటరామిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతపురం: ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో నిర్వహించే దులీప్ ట్రోఫీ కోసం పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం వద్దనున్న ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో నిర్వహించే దులీప్ ట్రోఫీపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శ్రీసత్యసాయి జిల్లా నూతన వైసీపీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిసారి మహిళకు పార్టీ అధ్యక్ష పదవి అవకాశం దక్కింది. కురుబ సామాజికవర్గానికి చెందిన ఈమె గతంలో 2019-24 వరకు కళ్యాణదుర్గం ఎమ్యెల్యేగా పనిచేశారు. 2021-24 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ పని చేశారు.
పుట్టపర్తిలోని 2వ వార్డులో దేవ అనే బాలుడు జ్వరంతో మరణించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. బాలుడుకి ఆదివారం నుంచి జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా అక్కడ నయం కాకపోవడంతో సత్యసాయి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వారు అనంతపురం తీసుకెళ్లాగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక చేసినట్లు ఆమె పార్టీ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఆమె ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.