India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతిరోజు టీచర్స్ అటెండెన్స్‌పై దృష్టిపెట్టాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. పుట్లూరు నుంచి 100% అటెండెన్స్ నమోదయిందని, గుమ్మగట్ట నుంచి టీచర్స్ అటెండెన్స్ చాలా తక్కువగా నమోదయిందన్నారు. టీచర్స్ అటెండెన్స్ పెరిగేలా చూడాలన్నారు. మున్సిపల్, మండల పరిధిలో ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టాలని ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి 132 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ పీ.జగదీశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, నాణ్యతగా పరిష్కారం చూపాలనే ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
మరో మూడ్రోజుల్లో అనంతపురం వేదికగా దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ నెల 5న జరగనున్న తొలి మ్యాచ్‌లో C, D జట్లు తలపడతాయి. ఈ టోర్నీకి వేదిక కానున్న RDT మైదానంలోని పిచ్ ఆస్ట్రేలియాలోని ‘పెర్త్’ను పోలి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమట. ఈ గ్రౌండ్‌లో 2004 నుంచి 2013 వరకు 15 మ్యాచులు జరగ్గా పేసర్లు 345, స్పిన్నర్లు 96 వికెట్లు తీశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల కోసం పనిచేసే గొప్ప వ్యక్తి అని కొనియాడుతూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు తమ అధినేత బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు చోట్ల అల్పాహారం పంపిణీ, రోగులకు పండ్లు, బ్రెడ్లు వంటివి అందజేస్తున్నారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలను భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. నేడు జరగాల్సిన పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహిస్తామని ఈ మార్పును విద్యార్థులు గమనించాలని కోరారు.
అనంతపురంలో జరగనున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు నేడు నగరానికి చేరుకోనున్నారు. సీ, డీ జట్ల ప్లేయర్లు మాత్రమే నేడు వస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత వారు నగరానికి చేరుకుంటారు. త్రీ స్టార్ హోటల్ అలెగ్జాండర్‌లో బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీ జట్టుకు రుతురాజ్, డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహిస్తారు. 8వ తేదీ తర్వాత బెంగళూరు నుంచి ఏ, బీ జట్లు అనంతపురానికి చేరుకుంటాయి.
జిల్లాలో అధిక వర్షాలు పడుతున్న కారణంగా JNTU విశ్వ విద్యాలయం పరిధిలో సెప్టెంబర్ 2వ తేదీ జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు అనంతపురం జేఎన్‌టీయూ పరీక్షల విభాగాధిపతి ఆచార్య నాగ ప్రసాద్ నాయుడు తెలిపారు. అధిక వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు.. పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ధర్మవరంలో ఈనెల 5న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నదని నియోజకవర్గ బీజేపీ నాయకులు తెలిపారు. త్వరలో పీఎం నరేంద్ర మోదీ, మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో విన్నర్ జట్టుకు రూ.1,00,000, రన్నర్ జట్టుకు రూ.50,000 బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ 3వ తేదీలోగా శ్రీ సత్యసాయి జిల్లా జట్లు మాత్రమే నమోదు చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వరద బాధితుడికి 25 కేజీల బియ్యం, కేజీ చక్కర, కేజీ నూనె, ఉల్లి, బంగాళదుంపలు అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాల కారణంగా గ్రామ, పట్టణ ప్రాంతాలలో నష్టం వాటిల్లితే టోల్ ఫ్రీకి నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాకు వర్ష సూచన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు తక్షణ సాయం కోసం 08885292432కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.