India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్య సాయి జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా వీడియోలు, రీల్స్ చేయాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి జయ కుమార్ బాబు తెలిపారు. రీల్స్ చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతి లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50,000, తృతీయ బహుమతి రూ.25000 ఇవ్వడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 5 లోగా రీల్స్ పంపాలన్నారు.
అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల స్పాట్ అడ్మిషన్ ల గడువును సెప్టెంబర్ 6 వరకూ పొడగించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణాధికారి ప్రొఫెసర్ హనుమాన్ కెన్నడి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 6వ తేదీ లోపు తమ యూనివర్శిటీకి మెయిల్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. పూర్తీ వివరాలకు యూనివర్శిటీ లోని సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.
శ్రీ సత్య సాయి జిల్లాలో గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులకు సింగల్ విండో విధానంతో అనుమతులు ఇవ్వనున్నట్టు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా అనుమతులు పొందవచ్చునన్నారు. 7995095800 నెంబర్ కు వాట్సప్ ద్వారా”Hi”అని సందేశం పంపిస్తే ఎన్వోసీ పత్రం కోసం అనుసరించాల్సిన ప్రక్రియ వాట్సాప్ కు వస్తుందన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఒకే కుటుంబానికి రూ.40 వేల పింఛన్ అందజేశారు. బోరంపల్లి గ్రామంలోని ఎర్రిస్వామి కుటుంబంలో ఒక వృద్ధ్యాప్య, ఒక దివ్యాంగ పింఛన్లతో మంచానికే పరిమితమైన వారి పింఛన్లు రెండు ఉన్నాయి. దీంతో వృద్ధ్యాప్య పింఛన్ ₹4 వేలు, దివ్యాంగ పింఛన్ ₹6 వేలు, మంచానికి పరిమితమైన ఇద్దరికీ చెరో రూ.15 వేలు చొప్పున మొత్తంగా ₹40 వేలను ఆ కుటుంబానికి అందజేశారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లాలో 2,84,358 మందికి గానూ 2,41,351 మందికి, సత్యసాయి జిల్లాలో 2,68,079 మందికి గానూ 1,99,592 మందికి పింఛన్ సొమ్ము అందజేశారు. అనంతపురం జిల్లాలో 84.88%, సత్యసాయి జిల్లాలో 74.45% పంపిణీ పూర్తయింది.
అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ మైదానంలో నేటి నుంచి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు సంబంధించి ఉచిత పాసులు ఇవ్వనున్నట్లు ఏసీఏ త్రిసభ్య కమిటీ సభ్యుడు మాంచో ఫెర్రర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి పాసులు జారీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 5 నుంచి జరగనున్న మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించాలంటే పాసులు తప్పనిసరి అని తెలిపారు. ఈ టోర్నీలో గిల్, రాహుల్, SKY, రుతురాజ్, కుల్‌దీప్ తదితర ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.
రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 32.0 నుంచి 35.0 డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 23.8 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా రెండ్రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది.
గుంతకల్లు పరిధి శాంతినగర్ రైల్వే క్వార్టర్స్‌లో రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్ హరిత ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో జత బంగారు కమ్మలు, వెండి వస్తువులు, కొంత నగదును దుండగులు చోరీ చేసినట్లు ఒకటో పట్టణ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 25న ఇంటికి తాళం వేసుకొని సొంత పనులపై తిరుపతి వెళ్లారు. 29న సాయంత్రం ఇంటికి వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత ఇసుకకు నూతన విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599ను విస్తృతంగా ప్రచారం చేయాలని మీనా ఆదేశించారు.
హిందూపురం MLA, హీరో బాలకృష్ణ 50ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘1974లో తెరంగేట్రం చేసిన మామయ్య వేయని పాత్ర లేదు. చేయని ప్రయోగం లేదు. 109 సినిమాలలో నటించి అవార్డులు, రివార్డులతో రికార్డు సృష్టించారు. అగ్ర హీరోగా వెలుగొందుతూనే రాజకీయాల్లో రాణిస్తూ సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్న అన్ స్టాపబుల్ హీరో మా బాల మామయ్య’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.