India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలో సెప్టెంబర్ 5 నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను తిలకించడానికి రేపు ఫ్రీ పాసులు జారీ చేయనున్నారు. నగరంలోని ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్‌లో రోజుకు కేవలం 4,100 పాసులు మాత్రమే జారీ చేస్తారు. పాసు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తారు. కాగా నగరంలోని రెండు మైదానాల్లో రోజుకు రెండు మ్యాచ్‌లు జరగనుండగా ప్రేక్షకులు తిలకించడానికి ఏ-మైదానంలో మాత్రమే సౌకర్యం ఉంది. బీ-మైదానంలో కూర్చోడానికి సౌకర్యం లేదు.
రొళ్ల మండలంలో మహిళ కమ్మలు, మెడలోని గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. జీబీహల్లి గ్రామంలో తిమ్మమ్మ అనే మహిళ తన పొలంలో పశువులను మేపుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని గోల్డ్ చైన్, చెవి కమ్మలను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు గమనించి మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో ఘనత సాధించింది. న్యాక్ ‘A’ గ్రేడ్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన కళాశాల భోదన, భోదనేతర సిబ్బందికి, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ‘A’ గ్రేడ్ రావడం కళాశాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
వన మహోత్సవం పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మొక్కలు నాటారు. పెనుకొండ మండలం పరిధిలోని పులేకులమ్మ ఆలయ సమీపంలో శనివారం ఉదయం మంత్రి సవిత మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటిన మొక్కలు సంరక్షించి వృక్షాలుగా పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు.
పేదల సంక్షేమం కోసం, రాయలసీమ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజా నాయకుడు పరిటాల రవీంద్ర అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నేడు దివంగత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ‘X’ వేదికగా లోకేశ్ నివాళులు అర్పించారు.
ఉరవకొండకు చెందిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న శతాధిక వృద్ధురాలు సావిత్రమ్మ(101) గురువారం ఆమె స్వగృహంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె భగవద్గీత శ్లోకాలను, వాటి తాత్పర్యాలు సులువుగా నోటితో చెప్పగల సమర్థురాలు. జాతిపిత మహాత్మా గాంధీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహాన్ని విజయవంతం చేయడంలో కృషిచేశారు.
నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు కృషి చేయాలని, పోలీస్ శాఖపై ప్రజలలో విశ్వసనీయత పెంచే విధంగా చూడాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు హత్యలు, రహదారి ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సాగు, అమ్మకాలపై ఉక్కు పాదం మోపాలని ఎక్సైజ్ అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును, అమ్మకాలను నియంత్రించాలని అధికారులకు సూచించారు.
అనంత జిల్లాలో కొత్తగా తొమ్మిది ఎఫ్ఎం రేడియో స్టేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో ఎఫ్ఎం రేడియోను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం తెలిపింది. అందులో భాగంగా జిల్లాకు 9 ఎఫ్ఎం రేడియో స్టేషన్లను కేటాయించారు. జిల్లాలోని అనంతపురంలో 3, గుంతకల్లులో 3, తాడిపత్రిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరా మిరెడ్డి ప్రభుత్వ అధికార చిహ్నంతో కూడిన లెటర్ ప్యాడ్‌ను ఇద్దరు వైసీపీ నాయకుల సస్పెన్షన్ ఉత్తర్వులకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని ధర్మవరం మండలం తిప్పేపల్లికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరణ్ కుమార్‌కు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్‌కు ఫిర్యాదు చేశానన్నారు.
Sorry, no posts matched your criteria.