India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు, కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాలలో ఉన్న పాఠశాలలకు అందజేస్తున్న కోడిగుడ్లలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు మంగళవారం తెలిపారు. ఇలాంటి గుడ్లు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతామని విద్యార్థులు వాపోతున్నారు. మంగళవారం గుడ్లు తీసుకునే సమయంలో ఓ కోడిగుడ్డు కింద పడిపోవడంతో పగిలింది. అందులో నుంచి పురుగులు బయటపడ్డాయని తెలిపారు.
త్వరలో జరగనున్న గ్రామం రెవెన్యూ సర్వీసులకు సంబంధిత అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. భూ సమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున సంబంధిత రెవెన్యూ అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం నమోదు, జాయింట్ ల్యాండ్ ప్రాపర్టీ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో వందరోజుల ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ పంట నమోదు 60శాతం పూర్తి అయిందని, సెప్టెంబర్ 15లోగా పంట సాగు వివరాలు పూర్తి చేయాలన్నారు.
యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ-II & కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ-2024 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ-II & కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ-2024 పరీక్షల నిర్వహణ కోసం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
దులీప్ ట్రోఫీకి అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానం సిద్ధమవుతోంది. వచ్చే నెల 5న టోర్నీ ప్రారంభం కానుండగా 2న భారత ఆటగాళ్లు అనంతపురం చేరుకుంటారు. అయితే ఈ మ్యాచ్‌లను స్టేడియంలో వీక్షించడానికి ప్రజలకు ఎలాంటి రుసుం లేకుండా అనుమతించనున్నట్లు సమాచారం. ఇక స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. 1962లో అనంతపురంలో జరిగిన ఇరానీ ట్రోఫీ తర్వాత ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం జిల్లా చరిత్రలోనే తొలిసారి.
అనంతపురంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమ మంత్రి సవిత విచారణకు ఆదేశించారు. విద్యార్థి తండ్రి లింగమయ్య అనుమానాలు వ్యక్తం చేయడంతో ఘటనపై పూర్తి విచారణ చేసి నివేదిక అందించాలని మంత్రి సవిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని హాస్టల్ అధికారులు చెబుతున్నారు.
డెంగ్యూతో నాలుగో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని ఎర్రగుంట గ్రామంలో జరిగింది. తండ్రి పీరా వలి వివరాల మేరకు.. నాలుగు రోజుల క్రితం బాలిక పింజరి మిస్బా కౌసర్ (9)కు జ్వరం రావడంతో స్థానికంగా వైద్యుల వద్ద చూపించారు. తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు తెలిపారు.
అనంతపురంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీకి భారత క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాహుల్, సూర్యకుమార్, గిల్, దూబే వంటి క్రికెటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. సుమారు యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు. ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం అనంతపురం జిల్లా చరిత్రలోనే తొలిసారి. సెప్టెంబరు 2న క్రికెటర్లు అనంతపురానికి చేరుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించింది. రాయలసీమలోని జిల్లాల్లో కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, తుముకూరు నూతన మార్గానికి రూ.250 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కంబదూరు రైల్వే స్టేషన్ పరిధిలో కూడా పలు అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నియోజకవర్గ బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ జగదీశ్ సోమవారం పెద్దారెడ్డి ఇంటికి బహిష్కరణ నోటీసులు పంపించినట్లు సమాచారం. తాము అనుమతిచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీళ్లేదని అందులో పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.