India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అక్టోబర్ నెల చివరి నాటికి శ్రీ సత్యసాయి జిల్లా లో ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. అమరావతిలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల చివరి నాటికి వెరిఫికేషన్ పూర్తి చేసి నివేదిక ఇస్తామన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరులో క్రిష్టప్ప అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. పొలంలో విద్యుత్ స్టాటర్ పెట్టె వద్ద క్రిష్టప్పకు షాక్ కొట్టి మృతిచెందారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో NRI వెల్ఫేర్ సొసైటీ వారు అందించే మహాత్మా గాంధీ లీడర్‌షిప్ అవార్డుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఎంపికయ్యారు. విశిష్ఠ అవార్డుకు దేశంలోని నిర్మాణ రంగంలో, సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్న SR కన్‌స్ట్రక్షన్స్ ఛైర్మన్ సురేంద్ర బాబును ఎంపికచేశారు. అవార్డను గాంధీ జయంతి అక్టోబర్ 2న అందుకోనున్నారు.

కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అనంతపురం జిల్లాలో కరువులో చిక్కుకున్న రైతులకు చేసిన సహాయం శూన్యమని మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల్లో అరాకోరాగా పంటలు సాగుచేసిన రైతులకు కూడా పంటలు ఎండిపోతుంటే.. ప్రభుత్వాలు రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే కరువు రైతులను ఆదుకోవాలన్నారు.

రాయదుర్గం మండలం టీ.వీరాపురం సమీపంలో రాయదుర్గం-కణేకల్లు ప్రధాన రోడ్డుపై రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 4.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన బొమ్మన్నగా స్థానికులు గుర్తించారు.

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?

రూ.3 కోసం హోటల్‌పై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దపప్పూరు మం. పరిధిలోని చీమలవాగుపల్లి సమీపంలో నారాయణస్వామి అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నారు. కొంత మంది వ్యక్తులు ఓ వస్తువు కొనుగోలు చేయగా హోటల్ యజమాని రూ.3 తిరిగివ్వాల్సి ఉంది. తర్వాత ఇస్తానని చెప్పగా మాటామాటా పెరిగి హోటల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈఘటనపై కేసు నమోదు చేసినట్లు పెద్దపప్పురు SI గౌస్ బాషా తెలిపారు.

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీ కాయల ధరలు ముందుకు సాగడం లేదు. సోమవారం మార్కెట్‌కు 10టన్నుల చీనీ కాయలు దిగుమతి అయినట్లు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవిందు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో గరిష్ఠంగా టన్ను రూ.18 వేలు, సరాసరి రూ.15 వేలు, కనిష్ఠంగా రూ.10 వేల ధర పలికినట్లు వెల్లడించారు. మార్కెట్‌లో ధరలు పెరగకపోవడంతో దిగుమతి తగ్గినట్లు తెలిపారు. మరోవైపు జిల్లాలో కిలో టమాటా గరిష్ఠంగా రూ.48 పలుకుతోంది.

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. యువతీ, యువకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేస్తున్నామని, ఆ డిజైన్లపై చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణతో సరిపెట్టకుండా చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.