India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో మంచి పనితీరు కనబర్చిన 46 మంది పోలీసు సిబ్బందికి SP జగదీష్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులను సకాలంలో కోర్టు ముందు హాజరుపరిచి శిక్షలు పడేలా, హత్యా కేసుల్లో యావజ్జీవ శిక్షలు పడేలా కోర్టులకు సహకరించడం, ఏటీఎం కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషి చేశారన్నారు.

తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ నూతన ఛైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. రాయదుర్గం పట్టణానికి చెందిన ఆయన విజయవాడలోని డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (AP-IEI) ఛైర్మన్‌గా ప్రొఫెసర్ MLS దేవకుమార్ నియమితులయ్యారు. అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయన.. గతంలో జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపల్‌గా, యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

విజయవాడలోని ఏపీ సచివాలయ ఛాంబర్‌లో మంత్రి నారా లోకేష్‌ను తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.

అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. రాప్తాడు వైసీపీ నేత మహానందరెడ్డికి ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయించడంతో నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానందరెడ్డి గతంలో ముగ్గురి హత్య కేసులో నిందితుడు. దీంతో సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్‌మెన్‌లను ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

అనంతపురంలో టమాటా ధర వారం రోజులుగా నిలకడగా ఉంది. కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.47 పలికినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మార్కెట్‌కు 1350 టన్నుల టమాటాలు వచ్చాయని చెప్పారు. సరాసరి ధర కిలో రూ.38, కనిష్ఠంగా రూ.30 పలికినట్లు పేర్కొన్నారు. ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

అనంతపురంలోని సెయింట్ జాన్స్ స్కూల్ పాఠశాల మైదానంలో ఆదివారం జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. 80 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. 12 మంది బాలురు, 12 మంది బాలికలు ఎంపికయ్యారన్నారు. అక్టోబర్ 6, 7వ తేదీల్లో కర్నూలు జిల్లా సీ.బెలగల్ ప్రభుత్వ పాఠశాలలో జరగనున్న అంతర్ జిల్లా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

గోరంట్ల మండలంలోని దిగువ గంగం పల్లి తండాలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాన్ని ఆదుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంఘటనా ప్రాంతానికి పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, గోరంట్ల తహశీల్దార్ మారుతి, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలపై నివేదికను అందజేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం తెలపడం మృతుల కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
Sorry, no posts matched your criteria.